హత్తుకున్న శునకం - dog
తార్పాలిన్లో చుట్టుకుపోయిన ఓ శునకాన్ని రక్షించాడు చిలీకి చెందిన ఓ పోలీసు అధికారి. కాపాడినందుకు కృతజ్ఞత భావంతో అధికారిని హత్తుకుంది ఆ శునకం. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
హత్తుకున్న శునకం
ఓ శునకాన్ని పాలీసు అధికారి కాపాడిన వీడియో అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. చిలీలోని శాంటియాగో పోలీసు అధికారి గియోవన్ని డామ్కే ప్రమాదంలో ఉన్న ఓ శునకాన్ని రక్షించాడు. తార్పాలిన్లో చుట్టుకుపోయిన శునకాన్ని గమనించిన డామ్కే.. ఫెన్సింగ్ దూకి వెళ్లి జాగ్రత్తగా తార్పాలిన్ను తొలగించాడు. సహాయానికి కృతజ్ఞతగా అతనిపైకి ఎగిరి హత్తుకుంది ఆ శునకం.