తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా రోగులకు ఐ-ప్యాడ్లు పంపిణీ - us corona patients news

ఒంటరిగా ఉన్నామని దిగులు చెందకుండా ఉండేందుకు కరోనా రోగులకు ఐ-ప్యాడ్​లు ఇస్తున్నారు అమెరికా వైద్యులు. ప్రజల ద్వారా వీటిని సేకరించి శానిటైజ్​ చేసిన అనంతరం రోగులకు అందజేస్తున్నారు.

doctors in america giving i-pads to corona patients
కరోనా రోగులకు ఐ-ప్యాడ్లు పంపిణీ

By

Published : May 10, 2020, 9:18 AM IST

Updated : May 10, 2020, 12:10 PM IST

కరోనా వైరస్‌ బారిన పడి ఆసుపత్రిలో అనాథల్లా తల్లడిల్లుతున్న వారి ఒంటరితనాన్ని పోగొట్టడానికి అమెరికాలోని వైద్యులు కొందరు మానవతను చాటుతున్నారు. పెద్ద వయసు రోగులకు తాము ఒంటరిమనే బాధ కలగనీయకుండా ‘మిషన్‌ ఐ-ప్యాడ్‌ సేకరణ’ ఉద్యమం ప్రారంభించారు. ప్రజల నుంచి ఐ-ప్యాడ్‌లు, ఫోన్లనూ సురక్షిత విధానాల్లో సేకరిస్తున్నారు. శానిటైజ్‌ చేసిన తర్వాత వాటిని రోగులకు అందిస్తున్నారు. వీటితో బాధితులు వీడియో కాల్‌ చేసుకుంటూ సాంత్వన పొందుతున్నారు.

బోస్టన్‌లో మొదలైన ఈ ఉద్యమం ప్రస్తుతం 20 రాష్ట్రాలకు విస్తరించింది. వైద్యుల చొరవతో కొందరు రోగులు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ, ధైర్యం తెచ్చుకుంటూ కొవిడ్‌ను జయిస్తున్నారు. ఇళ్లకు వెళ్లే సమయంలో వైద్యులను మనసారా దీవిస్తున్నారు.

Last Updated : May 10, 2020, 12:10 PM IST

ABOUT THE AUTHOR

...view details