కొవిడ్ టీకా వల్ల గర్భధారణపై ఎలాంటి జీవ సంబంధ ప్రభావాలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ అంశంపై ఎవరికైనా సందేహాలు ఉంటే నిజాలేంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఫైజర్ అధ్యయనాన్ని ఉదహరిస్తున్నారు.
ఒక అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో రెండు వేర్వేరు బృందాలకు ఫైజర్ టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు. టీకాలు తీసుకుంటే స్వల్పకాలం రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న నివేదికలపై పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. టీకాలు సంతాన సౌభాగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదని యేల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, గైనకాలజిస్టు డాక్టర్ మేరీ జేన్ మిన్‌కిన్ అన్నారు.
వ్యాక్సిన్ తీసుకోవడమే మేలు..