"భారతపై అమెరికా నిఘా పెట్టలేదు. అంతరిక్ష, ఆర్థిక రంగాల్లో భారత్తో సంబంధాలను బలోపేతం చేసే దిశగా అమెరికా కృషి చేస్తుంది.''
-అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి.
భారత తొలి ఏ-శాట్ ప్రయోగం గురించి తమకు ముందే తెలుసునని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. ప్రయోగ సమయంలో భారత్ రద్దు చేసిన విమాన సేవల వివరాలను పరిశీలించి అంచనా వేశామని తెలిపింది.
'మిషన్ శక్తి' పరీక్ష విజయవంతమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రకటించారు. ఈ ప్రయోగం చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. అదే రోజు రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో అమెరికాకు చెందిన ఆర్సీ- 135 ఎస్ కోబ్రా బాల్ నిఘా విమానం హిందూ మహాసముద్రంపై చక్కర్లు కొట్టినట్టు వార్తలు వచ్చాయి. పేలుళ్లు, ప్రయోగాలు జరిగినప్పుడు ఉత్పన్నమయ్యే బాలిస్టిక్ డేటాను సేకరించే విలువైన సాంకేతికత ఈ విమానం సొంతం.