తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఎన్నికల ఫలితాలపై బెర్నీ జోస్యం.. నిజమే! - u.s. election 2020 winners

అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరు తెన్నులను ముందుగానే పసిగట్టారు ఆ వ్యక్తి. ఎవరు గెలుస్తారు? తదుపరి జరిగే పరిణామాలు ఏంటి ? ఫలితాలపై ట్రంప్​ ఏం చెబుతారు? అనే విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు. ఆయన పేరే బెర్నీ సాండర్స్‌. ఓ కార్యక్రమంలో వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బెర్నీ చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి.

did bernie sanders predicted every election move of trump
అమెరికా ఎన్నికల్లో ఏం జరగనుందో ముందే చెప్పేశాడు

By

Published : Nov 6, 2020, 5:24 AM IST

అగ్రరాజ్య ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాన్ని గురించి ఓ జ్యోతిష్కుడు ఊహించి చెప్పిన దాన్ని.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా ట్వీట్‌ చేశారు. అయితే ఆయన చెప్పినదానికి, జరిగిన దానికి కాస్త తేడా ఉన్న మాట నిజం. కాగా.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తీరుతెన్నులు ఎలా ఉంటాయో కంటికి కట్టినట్టు రెండు వారాల క్రితమే మరొకరు చెప్పారు. అయితే ఇది మరో జ్యోతిష్కుడు కాదు.. డెమొక్రాటిక్‌ సెనేటర్‌ బెర్నీ సాండర్స్‌. ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయని 79 ఏళ్ల బెర్నీని ఓ ముఖాముఖిలో వ్యాఖ్యాత అడిగారు. ఇందుకు పోస్టల్‌ ఓట్లు భారీ సంఖ్యలో పోలవుతాయని.. దీని వల్ల ఎన్నికల ప్రక్రియ, ఫలితాల వెల్లడి కూడా ఆలస్యం కానున్నాయని ఆయన జవాబిచ్చారు.

అంతేకాకుండా "పెన్సిల్వేనియా, మిషిగన్‌, విస్కాన్నిన్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొన్ని కారణాల వల్ల ఆలస్యమౌతుంది. ఇందుకు లక్షల సంఖ్యలో వచ్చిపడే పోస్టల్‌ బ్యాలెట్లు కారణం కావచ్చు. ఇక ఎన్నికల రోజు రాత్రి సుమారు 10 గంటలకు ట్రంప్‌ కొన్ని రాష్ట్రాల్లో గెలుస్తారు... ఇంకా పూర్తి ఫలితాలు వెలువడకుండానే "తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు" అంటూ ప్రకటనలు చేస్తారు. అతను గెలవని కొన్ని కీలక రాష్ట్రాల్లో మోసం జరిగిందని ఆరోపిస్తారు. న్యాయవ్యవస్థ సరిగా పనిచేయాలని కోరతారు. ఓటింగ్‌ ప్రక్రియను వెంటనే ఆపాలని.. అందుకు గాను తాను సుప్రీం కోర్టుకు కూడా వెళతానంటారు. ఆ తర్వాతి రోజు లేదా ఆపై రోజు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు పూర్తవుతుంది. బైడెన్‌ గెలిచినట్టు వెల్లడౌతుంది. అప్పుడు కూడా.. పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం లోపభూయిష్టమైనదనే తన వాదన రుజువైందని ట్రంప్‌ మళ్లీ ప్రకటిస్తారు." అని వెల్లడించారు. కాగా ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరగటం అందరికీ తెలిసిందే.

కాగా ఈ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించిన ఈ వీడియో చూసి.. బెర్నీ సాండర్స్‌ జోస్యం నిజమో కాదో మీరే నిర్ణయించండి.

ఇదీ చూడండి: ఒబామా రికార్డును బ్రేక్ చేసిన బైడెన్

ABOUT THE AUTHOR

...view details