టీకా సమర్థతపై అమెరికాలోని ఓహాయో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కీలక విషయాల్ని వెల్లడించారు. ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటు, ఒంటరితనం వంటి సమస్యలు.. రోగనిరోధక వ్యవస్థను బలహీనం చేస్తాయని పేర్కొన్నారు. తద్వారా.. వారిపై కొవిడ్ వంటి వ్యాక్సిన్ల సమర్థత దెబ్బతింటాయని స్పష్టం చేశారు.
టీకా తీసుకోవడానికి 24 గంటల ముందు వ్యాయామం, సరైన నిద్ర ఉన్నట్లైతే.. టీకా ప్రభావం అధికంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు. పర్స్పెక్టివ్స్ ఆఫ్ సైకలాజికల్ సైన్స్ జర్నల్లో వీరి అధ్యయనం ప్రచురితమైంది.
శారీరకంగానే కాదు.. మానసికంగానూ కరోనా మహమ్మారి ప్రభావాన్ని చూపుతుంది. దానివల్ల ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఫలితంగా వ్యాక్సిన్ సమర్థతపై ప్రభావం పడుతుంది.