ఇందు కలదు అందు లేదని సందేహమే అక్కర్లేదు. ఆధునిక సాంకేతికత ఉపయోగించని రంగమంటూ ఏదీ లేదు. ఉదాహరణకు మణికట్టుకు పెట్టుకున్న గడియారం మనం ఎన్ని అడుగులు, ఎంత వేగంతో నడిచామో ఇట్టే చెప్పేస్తుంది. అంతే కాదు దైనందిన జీవితంలో ధరించే వస్తువులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పనిచేసి రక్త పోటు, మధుమేహం వంటి ఆరోగ్య సంబంధిత గణనలు ఎంత మోతాదులో ఉన్నాయో కూడా చెప్పేస్తాయి. ఆ కోవలోనే పళ్లుతోమే హైటెక్ బ్రష్ ఒకటి వచ్చేసింది.
అమెరికాకు చెందిన ఓరల్-బీ సంస్థ ఈ అత్యాధునిక టూత్ బ్రష్‌ని రూపొందించింది. సాధారణంగా మనిషికి ఆహార, శారీరక శుభ్రత ఎంత ముఖ్యమో నోటి శుభ్రత కూడా అంతే ముఖ్యం అంటోంది. ఈ బ్రష్ ని డిజైన్ చేసిన ఓరల్ బీ సంస్థ. అందుకు తగినట్లుగానే ఆధునిక సాంకేతికను జోడించి టూత్ బ్రష్ డిజైన్ చేశామంటున్నారు.
బ్రష్ పని చేసే విధానం.
ఈ టూత్ బ్రష్ ఉపయోగించే వారు దాని తాలూకు మొబైల్ యాప్‌ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఉదయం దంత దావన సమయంలో బ్రష్ ఆన్ చేసి పళ్లు తోముకావాలి. మనం ఎంత మేర బ్రష్ చేశాము. ఏ దంతాన్నైనా బ్రష్ చేయకుండా వదిలి పెట్టామా అన్న విషయం మొబైల్లో ఉండే యాప్ తెలుపుతుంది.