అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ గెలవడంపై డెమొక్రాట్లు ఆనందంలో మునిగితేలుతున్నారు. అయితే 'ప్రతినిధుల సభ' రూపంలో వారికి కొత్త సమస్య వచ్చిపడింది. ఈసారైనా సెనేట్లో జెండా ఎగరవేయాలనుకున్న వారి ఆశలపై నీరుగారడం సహా ప్రతినిధుల సభలో తమ ఆధిపత్యానికే ఎసరొచ్చిపడింది.
మెజారిటీ తగ్గింది...
అధ్యక్ష ఎన్నికలతో పాటు.. 435 సీట్లున్న అమెరికా ప్రతినిధుల సభకు పోలింగ్ జరిగింది. ఇప్పటికే 218 స్థానాలు దక్కించుకున్న డెమొక్రాట్లు మరో రెండేళ్లపాటు ప్రతినిధుల సభలో పైచేయి సంపాదించుకున్నారు. అయితే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ.. ప్రస్తుతమున్న 232 సీట్లు దక్కకపోవచ్చని ఫలితాలను చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతోంది. రిపబ్లికన్లు అనూహ్యంగా పుంజుకోవడం బైడెన్ వర్గాన్ని దెబ్బకొట్టింది. కనీసం 15స్థానాల్లో ఓటమిపాలయ్యే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత డెమొక్రాట్ చట్టసభ్యుల్లో కనీసం ఏడుగురు ఓడిపోవడం పార్టీని కలవరపెడుతోంది.
ఇదీ చూడండి:-అధ్యక్షుడిగా బైడెన్ తొలి సంతకం దేనిపై?