అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పదవీ కాలం ముగిసే చివరి రోజుల్లో మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా సెనేట్‌లోనూ డెమొక్రాటిక్ పార్టీ అధిపత్యాన్ని చేజిక్కించుకుంది. దీనితో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు కాంగ్రెస్ ఉభయ సభల్లో మెజారిటీ దక్కింది.
సార్వత్రిక ఎన్నికల్లో.. రిపబ్లికన్లకు కీలక రాష్ట్రమైన జార్జియాలో ఇద్దరు డెమొక్రాట్లు విజయం సాధించి బైడెన్‌కు ఈ మెజారిటీ కట్టబెట్టారు. 100 మంది సభ్యులున్న సెనేట్‌లో ఇరు పార్టీలు 50-50 సీట్లు దక్కించుకున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న భారత మూలాలున్న కమలా హారిస్ వేసే ఓటుతో... ఏ నిర్ణయమైనా డెమొక్రాట్లకు అనుకూలంగా ఉండనుంది.