తెలంగాణ

telangana

ETV Bharat / international

మోసం చేసి మళ్లీ గెలిచేందుకు ట్రంప్ యత్నం: డెమొక్రాట్లు - us president latest news

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై అభిశంసన విచారణలో భాగంగా సెనేట్లో ఆయనపై బలమైన కేసు మోపాలని యత్నిస్తున్నారు డెమొక్రాట్లు. ఈ ఏడాది జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మోసం చేసి గెలవాలని ట్రంప్ చూస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం విదేశాల నుంచి సాయం తీసుకుంటున్నారని విచారణ సందర్భంగా సెనేట్​లో వాదించారు.

trump
డొనాల్డ్ ట్రంప్​

By

Published : Jan 23, 2020, 11:08 AM IST

Updated : Feb 18, 2020, 2:22 AM IST

మోసం చేసి మళ్లీ గెలిచేందుకు ట్రంప్ యత్నం: డెమొక్రాట్లు

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అభిశంసనపై సెనేట్​లో వాడీవేడి వాదనలు సాగుతున్నాయి. ఆయనపై బలమైన కేసు మోపాలని ప్రతిపక్ష డెమొక్రాట్లు కృతనిశ్చయంతో ఉన్నారు. అభిశంసనపై వీరి తరఫున వాదనలు ప్రారంభించారు అడమ్​ స్కిఫ్​. డెమొక్రాట్ల ముఖ్యనేతగా ఉన్న ఈయనే ట్రంప్​ అభిశంసనపై ప్రతినిధుల సభ న్యాయవిచారణ బృందానికి సారథ్యం వహించారు.

ఈ ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోసం చేసైనా మళ్లీ గెలవాలని ట్రంప్ యత్నిస్తున్నారని స్కిఫ్​ ఆరోపించారు. ఇందుకోసం అధికారాన్ని ఉపయోగించి విదేశాల సాయం తీసుకుంటున్నారని వాదనలు వినిపించారు. తనపై అభిశంసనపై విచారణను జరగకుండా అడ్డుకునేందుకు కూడా ట్రంప్​ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని స్కిఫ్ సభకు తెలిపారు. చట్టానికంటే తాను ఎక్కువనే పోకడను ట్రంప్ అవలంబించారని పేర్కొన్నారు.

డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న జో బిడెన్​పై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్​పై ట్రంప్ ఒత్తిడి తెచ్చారని వాదనల సందర్భంగా చెప్పారు స్కిఫ్. అధ్యక్ష ఎన్నికల్లో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో రష్యాతో వ్యూహాత్మక యుద్ధ భాగస్వామ్యం కోసం వందల మిలియన్ డాలర్ల మిలిటరీ సాయాన్ని నిలిపివేశారని ఆరోపించారు. ఈ ప్రవర్తన ట్రంప్ అభిశంసనకు కారణం కాకపోతే మరేదీ కాదని స్కిఫ్ అన్నారు. ఆయనను పదవి నుంచి తొలగించాలన్నారు.

100మంది సభ్యులున్న సెనేట్​లో ట్రంప్​పై అభిశంసన నెగ్గాలంటే రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం. రిపబ్లికన్లకు 53, డెమొక్రాట్లకు 47మంది సభ్యుల బలముంది. ట్రంప్​పై అభిశంసనకు ఎగువ సభ ఆమోదం తెలపడం దాదాపు అసాధ్యం.

ఇదీ చూడండి: బ్రెగ్జిట్​ ఒప్పందానికి బ్రిటన్​ పార్లమెంటు ఆమోదం

Last Updated : Feb 18, 2020, 2:22 AM IST

ABOUT THE AUTHOR

...view details