తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 5:07 PM IST

ETV Bharat / international

పాపులర్​ ఓట్లలో మళ్లీ డెమొక్రట్లదే హవా..కానీ!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టి అత్యధిక పాపులర్​ ఓట్లు సాధించటంలో డెమొక్రట్లు మళ్లీ తమ హవా కొనసాగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గెలుపొందిన అభ్యర్థుల్లో జో బైడెన్​కు అత్యధికంగా 77.5 మిలియన్​ ఓట్లు వచ్చాయి. అయితే.. భారీగా పాపులర్​ ఓట్లు దక్కించుకుంటున్నా అధికారం అందుకోవటంలో వెనకబడుతున్నట్లు పలువురు డెమొక్రట్లు ఆందోళన చెందుతున్నారు.

Democrats keep winning the popular vote
పాపులర్​ ఓట్లలో మళ్లీ డెమొక్రట్లదే హవా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్​ ఓట్లు దక్కించుకోవటంలో 2020 ఎన్నికల్లోనూ డెమొక్రట్లదే హవా కొనసాగింది. ఎనిమిది వరుస ఎన్నికల్లో చూస్తే ఏడు సార్లు ఈ మైలురాయిని అందుకుంది పార్టీ. అయితే.. కొందరు డెమొక్రట్లలో అదే ఆందోళన కలిగిస్తోంది.

ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​కు ఇప్పటి వరకు 50.8 శాతం పాపులర్​ ఓట్లు వచ్చాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు 47.4 శాతం పాపులర్​ ఓట్లు దక్కాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్​ వంటి డెమొక్రట్ల కంచుకోటల్లో ఇంకా బ్యాలెట్​ ఓట్లను లెక్కిస్తున్నందున మరో 5 మిలియన్ల ఓట్లు ఆ పార్టీకి వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థుల్లో బైడెన్​కే అత్యధికంగా 77.5 మిలియన్​ పాపులర్​ ఓట్లు వచ్చాయి. అలాగే.. ఎన్నికల్లో ఓటమిపాలైన అభ్యర్థుల్లో అధ్యక్షుడు ట్రంప్​కు అత్యధికంగా 72.3 మిలియన్​ ఓట్లు రావటం గమనార్హం.

పెరుగుతున్న అంతరం..

మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా 2012లో 4 శాతం పాపులర్​ ఓట్ల ఆధిక్యాన్ని బైడెన్​ అధిగమిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2008లో ఒబామా 7 శాతం పాయింట్ల తేడాతో సాధించిన విజయమే అతిపెద్దది. కానీ, చాలా మంది డెమొక్రట్లు తమ పాపులర్​ ఓట్లు, వారి అధికారానికి పెరుగుతున్న అంతరంపై ఆందోళన చెందుతున్నారు. డెమొక్రాట్లు ఎక్కువ మంది మద్దతుదారులను గెలుచుకోవచ్చు. కానీ, ఆ ఓట్లు తమ విధానాలను అమలు చేసేందుకు అవసరమైన మెజారిటీని సాధించలేకపోతున్నాయి. ఈ ఏడాది కూడా ఆ అధికార అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. పాపులర్​ ఓట్లను దక్కించుకోవటంలో బైడెన్​ చరిత్ర సృష్టించవచ్చు కానీ, ప్రతినిధుల సభలో గతంతో పోలిస్తే 8 సీట్లు కోల్పోయారు. మెజారిటీని గెలుచుకోవటంలో విఫలమయ్యారు. న్యూ హ్యాంప్​షైర్​ శాసనసభలో పట్టు కోల్పోయారు. అమెరికా సెనేట్​లోను తిరిగి తమ ఆధిక్యాన్ని సాధించటంలో కూడా డెమొక్రట్లు విఫలమయ్యారు.

పాపులర్xఎలక్టోరల్.. తేడా ఇదే

అధ్యక్ష ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పాపులర్ ఓట్లు అంటారు. పాపులర్ ఓట్ల ద్వారా అమెరికా కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, గవర్నర్లు, రాష్ట్ర శాసనసభ్యులను ఎన్నుకుంటారు. అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఎలక్టోరల్ ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రాల జనాభా ఆధారంగా ఎలక్టార్ల సంఖ్య ఉంటుంది. రాజకీయ పార్టీల తరపున ఆయా రాష్ట్రాల్లో బరిలో ఉన్న ఎలక్టార్లకు ఓటేస్తే.. వారు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

ఇదీ చూడండి:అమెరికా ఎన్నికలు: బైడెన్​ 306.. ట్రంప్​ 232..!

ABOUT THE AUTHOR

...view details