తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2020, 4:30 PM IST

Updated : Feb 28, 2020, 3:58 AM IST

ETV Bharat / international

ట్రంప్ అభిశంసనలో కొత్త ట్విస్ట్- ఆ పుస్తకమే కారణం

అమెరికా మాజీ భద్రతా సలహాదారు జాన్​ బోల్టన్​ రాసిన ఓ పుస్తకం అగ్రరాజ్య రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే అభిశంసన తీర్మానంతో ట్రంప్​పై గురిపెట్టిన ప్రత్యర్థులకు సరికొత్త అస్త్రమైంది. చుట్టుముట్టిన సవాళ్ల నుంచి బయటపడేందుకు ట్రంప్​ వర్గం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

trump
ట్రంప్ అభిశంసనలో కొత్త ట్విస్ట్- ఆ పుస్తకమే కారణం

అభిశంసన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను మరిన్ని చిక్కులు చుట్టుముడుతున్నాయి. అధికార దుర్వినియోగానికి సంబంధించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రత్యర్థులు(డెమొక్రటిక్ నేత, అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆయన కుమారుడు, ఇతరుల)ను ఇరుకున పెట్టేందుకు ఉక్రెయిన్ సహకరించే వరకు ఆ దేశానికి ఆర్థిక సాయం నిలిపివేయాలని జాతీయ భద్రతా సలహాదారు జాన్​ బోల్టన్​తో ట్రంప్​ అన్నట్లు తెలిసింది. బోల్టన్​ స్వయంగా రాసిన ఓ పుస్తకంలో ఈ విషయం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్​ పత్రిక కథనం ప్రచురించింది.

ఉక్రెయిన్​లోని ఓ గ్యాస్​ కంపెనీతో బిడెన్​ కుటుంబానికి సంబంధం ఉంది. ఆ సంస్థకు చెందిన వ్యవహారాలపై దర్యాప్తునకు ఆదేశించేలా ఉక్రెయిన్​ ప్రభుత్వంపై ట్రంప్​ ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ.

సరికొత్త అస్త్రం...

అధికార దుర్వినియోగం ఆరోపణలతో ట్రంప్​ను అభిశంసించడంపై అమెరికా ఎగువ సభలో విచారణ జరుగుతోంది. నేటి నుంచి ట్రంప్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. ఇలాంటి సమయంలో జాన్​ బోల్టన్ పుస్తకంలోని అంశాలు ప్రతిపక్షానికి సరికొత్త అస్త్రాలుగా మారాయి. బోల్టన్​ను సాక్షిగా సభకు పిలిచి, సమగ్ర విచారణ జరిపించాలని డెమొక్రటిక్ పార్టీ నేతలు పట్టుబడుతున్నారు.

జాన్​ బోల్టన్​ గతేడాది సెప్టెంబర్ 10న జాతీయ భద్రతా సలహాదారు పదవి నుంచి వైదొలిగారు. ఆ మరుసటి రోజే ఉక్రెయిన్​కు ఆర్థిక సాయం విడుదల చేసింది ట్రంప్ సర్కార్. శ్వేతసౌధం అధికారులు ఎవరూ అభిశంసన విచారణలో పాల్గొనరాదని ట్రంప్​ ఆదేశించినా... తాను వచ్చి సాక్ష్యం చెబుతానని ఇప్పటికే ప్రకటించారు బోల్టన్.

సేల్స్ కోసమే....

జాన్​ బోల్టన్​ పుస్తకంలో ఉన్నట్లు చెబుతున్న విషయాల్ని ట్రంప్​ ఖండించారు. ఉక్రెయిన్​కు సాయం నిలిపివేతపై బోల్టన్​తో తాను ఏమీ చెప్పలేదని స్పష్టంచేశారు. ఒకవేళ అలా చెప్పినట్లు ఏమైనా ఉంటే... అవన్నీ పుస్తకాల విక్రయాలు పెంచుకునేందుకు రాసినవే అని విమర్శించారు ట్రంప్.

ఇదీ చూడండి: 11 లక్షల మందిని చంపేసింది ఇక్కడే....

Last Updated : Feb 28, 2020, 3:58 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details