తెలంగాణ

telangana

ETV Bharat / international

ఓటుహక్కు వినియోగించుకున్న జో బైడెన్ - అమెరికా ఎన్నికల్లో ఓటేసిన బైడెన్

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఓటేశారు. తన సతీమణితో కలిసి స్వస్థలం డెలావేర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే రిపబ్లికన్లతోనూ కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.

Democratic U.S. presidential nominee Biden votes early in Wilmington
అమెరికా ఎన్నికల్లో ఓటేసిన జో బైడెన్

By

Published : Oct 29, 2020, 5:26 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి తన స్వస్థలం డెలావేర్​లోని విల్మింగ్టన్​లో ఓటేశారు. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ తరహాలోనే ముందస్తుగా తన ఓటును నమోదు చేశారు.

ఓటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన బైడెన్.. ఎన్నికల్లో గెలిస్తే రిపబ్లికన్లతోనూ కలిసి పనిచేస్తానని చెప్పారు. వైద్య సంరక్షణకు సంబంధించి తన ప్రణాళికలను వివరించారు. ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన వైద్య చట్టాన్ని మరింత మెరుగుపర్చేదిశగా ప్రయత్నించనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details