తెలంగాణ

telangana

ETV Bharat / international

డొనాల్డ్​ ట్రంప్​కు మళ్లీ అభిశంసన చిక్కులు! - అభిశంసన

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థిగా నిలవాలని ఆశిస్తున్న సెనెటర్​ ఎలిజిబెత్​ వారెన్​... ట్రంప్​ అభిశంసన ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని స్వాగతించిన కారణంగా ట్రంప్​ను పదవి నుంచి తప్పించాలని కోరారు.

ట్రంప్​ను అభిశంసించండి: డెమోక్రట్​ అధ్యక్ష అభ్యర్థి

By

Published : Apr 20, 2019, 10:27 AM IST

Updated : Apr 20, 2019, 10:39 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ​ట్రంప్​ అభిశంసనకు చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్​ పార్టీ సెనెటర్​, ఆశావాహ అధ్యక్ష అభ్యర్థి ఎలిజబెత్​ వారెన్​ దిగువసభను కోరారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం, కుట్ర విషయంలో ట్రంప్​ ప్రమేయం ఉందని ఆమె ఆరోపించారు.

"మ్యూలర్​ నివేదిక వాస్తవాలు తెలియజేస్తోంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలపై విదేశీ ప్రభుత్వం(రష్యా) దాడి చేసింది. డొనాల్డ్​ ట్రంప్​కు సహాయం అందించింది. ఆ సహాయాన్ని ట్రంప్​ స్వాగతించారు. ట్రంప్​ అధికారంలోకి వచ్చాక (మ్యూలర్)​ దర్యాప్తును ఆటంకపరిచారు."
- ఎలిజబెత్ వారెన్​, మాసాచుసెట్స్​ సెనెటర్

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​కు అనుకూలంగా రష్యా జోక్యం, కుట్రపై 'మ్యూలర్​ నివేదిక' ఇటీవలే విడుదలైంది. ఎన్నికల్లో జోక్యానికి రష్యా ప్రయత్నించిందని, అయితే ట్రంప్​ వర్గం మాత్రం ఆ చర్యల్ని సమర్థించలేదన్నది నివేదిక సారాంశం.

ఇదీ చూడండి: పింఛను పెంచమన్న జవాన్లకు ఆరేళ్ల జైలు

Last Updated : Apr 20, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details