అమెరికా క్యాపిటల్ భవనంలో జరిగిన ఘర్షణను అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ ఖండించారు. ప్రజాస్వామ్యం అసాధారణ దాడికి గురైందన్నారు. టీవీ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించిన బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఇప్పుడు ప్రజాస్వామ్యంపై అసాధారణ దాడి జరిగింది. ఈ ఆధునిక కాలంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ చూడలేదు. ప్రజా ప్రతినిధులను క్యాపిటల్ హిల్ పోలీసులు కాపాడడాన్ని మనం చూశాం. చట్టంపై జరిగిన ఈ దాడిని ఎన్నడూ చూడలేదు. ఆందోళనల సందర్భంగా కనిపించిన దృశ్యాలు నిజమైన అమెరికాను ప్రతిబింబించవు. కొద్ది మంది ఉగ్రవాదులు చట్టాన్ని ఉల్లంఘించారు. ఇది దేశద్రోహం."
-- జో బైడెన్, అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత.
బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు సమావేశమైన కాంగ్రెస్కు వ్యతిరేకంగా వందలాది మంది ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని చుట్టుముట్టారు. బారికేడ్లు తోసుకుంటు లోపలికి చొచ్చుకేళ్లారు. నిరసనకారుల కన్నా పోలీసులు తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పరిస్థితి చెయ్యిదాటిపోయింది. ఈ పరిణామాలు కాల్పులకు దారితీశాయి. ఫలితంగా ఇప్పటివరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
'అమెరికాకే అవమానం'