తెలంగాణ

telangana

ETV Bharat / international

చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడట!

చేయని నేరానికి దాదాపు 30ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడు అమెరికాలోని ఓ వ్యక్తి. నాలుగేళ్ల చిన్నారి హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని నిరూపించేందుకు ఇంతకాలం పట్టినందుకు అతని తరఫు న్యాయవాది విచారం వ్యక్తం చేశారు.

Death row inmate in US walks free after 30 years in girl's killing
చెయ్యని నేరానికి 30 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి

By

Published : Jun 6, 2020, 4:03 PM IST

అమెరికా ఫిలడెల్ఫియాకు చెందిన వాల్టర్ ఒగ్రోడ్ దాదాపు 30 ఏళ్లుగా ఓ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఏ నేరం చేయకపోయినా తాను నిర్దోషి అని కోర్టు ఎదుట నిరూపించుకునేందుకు అతనికి ఇన్నేళ్లు పట్టింది. హత్యానేరానికి ఒగ్రోడ్​కు ఎలాంటి సంబంధం లేదని తెలిశాక న్యాయస్థానం ఎట్టకేలకు అతనికి బెయిల్​ మంజూరు చేసింది. శుక్రవారమే జైలు నుంచి విడుదలయ్యాడు.

1988 నాటి కేసు..

ఫిలడెల్ఫియాలో 1988లో నాలుగేళ్ల చిన్నారి బార్బరా జీన్​ దారుణ హత్యకు గురయ్యింది. టీవీ బాక్స్​లో ఆమె మృతదేహన్ని ఇంటికి 1000 అడుగుల దూరంలో వదిలి వెళ్లారు దుండగులు. పక్కింటి వారి సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పడు ఒగ్రోడ్ వయసు 23 ఏళ్లు. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత హత్యకు సంబంధముందనే అనుమానంతో ఒగ్రోడ్​ను అరెస్టు చేశారు పోలీసులు. అప్పుడు అతను బేకరీ ట్రక్​ డ్రైవర్​గా పని చేస్తున్నాడు.

ఈ కేసుపై మొదటి సారి విచారణ చేపట్టినప్పుడు ఒడ్రిగో నిజం చెప్పడం లేదని అధికారులు నివేదికలో తెలిపారు. ఆ తర్వాత 1996లో హత్యాయత్నం అభియోగంతో మరోసారి విచారణ జరిపారు. అయితే అతనికి హత్యతో సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు.

ప్రత్యక్ష సాక్షి చెప్పిన ఆనవాళ్లకు ఒడ్రిగోకు ఎలాంటి పోలికలు లేవు. ఈ విషయాన్ని న్యాయస్థానం, అతని తరఫు న్యాయవాదులు ధ్రువీకరించారు. అనంతరం అతను నిర్దోషి అని బెయిల్ మంజూరు చేసింది ఫిలడెల్పియా న్యాయస్థానం.

నిర్దోషిగా నిరూపించేందుకు 28 ఏళ్లు పట్టినందుకు విచారం వ్యక్తం చేశారు ఒడ్రిగో తరఫు న్యాయవాది. ఈ కేసుకు సంబంధించి అతన్ని మరోసారి విచారించవద్దని కోర్టును కోరారు. చిన్నారి హత్య కేసులో మరో అనుమానితుడు ఎవరైనా ఉన్నారా అనే విషయంపై అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ABOUT THE AUTHOR

...view details