తెలంగాణ

telangana

ETV Bharat / international

బైడెన్ ప్రమాణం- భద్రతా వలయంలో వాషింగ్టన్​ - biden inauguration security

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్​ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో రాజధాని వాషింగ్టన్​ డీసీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బయటి శక్తుల నుంచే కాక, భద్రతా సిబ్బంది నుంచి కూడా బైడెన్​కు ముప్పు ఉందనే నిఘా వర్గాల సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏకంగా 25వేల బలగాలను రంగంలోకి దించారు. ఎఫ్​బీఐ సమాచారం మేరకు.. 12మంది నేషనల్​ గార్డ్​ సభ్యులను విధుల నుంచి తొలగించారు. ఇందులో ఇద్దరికి అతివాద శక్తులతో సంబంధాలున్నట్లు గుర్తించారు.

DC on lockdown and on edge before Biden's inauguration
భద్రతా వలయంలో వాషింగ్టన్​

By

Published : Jan 20, 2021, 1:39 PM IST

అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా జో బైడెన్​ మరికొద్ది గంటల్లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. క్యాపిటల్ భవనంలో జనవరి 6న హింస చెలరేగిన నేపథ్యంలో.. ప్రమాణ స్వీకారంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. రాజధాని వాషింగ్టన్​ డీసీని బలగాలతో నింపారు. అతివాద శక్తుల నుంచే కాకుండా భద్రతా సిబ్బంది నుంచి కూడా బైడెన్​కు ముప్పు పొంచి ఉందనే నిఘావర్గాల సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎఫ్​బీఐ సమాచారం మేరకు 12మంది నేషనల్​ గార్డ్​ సభ్యులను విధుల నుంచి తొలగించారు. వీరిలో ఇద్దరికి అతివాద సంస్థలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. వీరు క్యాపిటల్ ఘటనపై అభ్యంతరకర పోస్టులు, ప్రకటనలు చేసినట్లు ధ్రువీకరించారు.

బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం దృష్ట్యా క్యాపిటల్​ ఘటన అనంతరం వాషింగ్టన్​ డీసీలో అత్యయిక స్థితి విధించారు. లాక్​డౌన్ అమలు చేస్తున్నారు. ఏకంగా 25వేల బలగాలను రంగంలోకి దించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

అయితే 12మంది నేషనల్​ గార్డ్​ సభ్యులను తొలగించడంపై సీనియర్​ అధికారులు ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వలేదు. వారు ఏ అతివాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే విషయంపై వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.

నేషనల్​ గార్డ్ వేషధారణలో అతివాద శక్తులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఎఫ్​బీఐ హెచ్చరించినట్లు లా ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు తెలిపారు. నిఘా వర్గాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​పై విమర్శల జడివాన స్వయంకృతమే!

ABOUT THE AUTHOR

...view details