అండర్ వరల్డ్ డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంకు తమ దేశపౌరసత్వం లేదని కామన్‌వెల్త్ ఆఫ్ డొమినికా స్పష్టం చేసింది. దావూద్ ఇబ్రహీంకు మా దేశ పాస్‌పోర్ట్ కూడా లేదని అధికారిక ప్రకటన చేసింది. దావూద్ డొమినికన్ పాస్‌పోర్టు కలిగివున్నాడని వస్తోన్న వార్తలను ఆ దేశం ఖండించింది. అతనికి తమ దేశ పౌరసత్వం లేదని, అంతేకాకుండా పెట్టుబడుల కార్యక్రమాల పేరుతో కూడా దావూద్‌కు ఎలాంటి పౌరసత్వం ఇవ్వలేదని స్పష్టం చేసింది.
పౌరసత్వం జారీచేసే చేసే క్రమంలో నిజాయితీతో నూతన విధానాలను అనుసరిస్తున్నామని.., దావూద్ విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా అసత్యమని డొమినికా ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.