తెలంగాణ

telangana

ETV Bharat / international

అత్తకు బాయ్​ఫ్రెండ్​ కావాలంటూ కోడలి ప్రకటన!

తన అత్తకు బాయ్​ఫ్రెండ్​ కావాలంటూ ప్రకటన ఇచ్చింది ఓ కోడలు. ఊరికే కాకుండా.. వెయ్యి డాలర్లు చెల్లిస్తామని కూడా ప్రకటించింది. అయితే అందుకు కొన్ని షరతులు మాత్రం పెట్టింది. ఈ పోస్ట్​ ఇంటర్నెట్​లో తెగ వైరల్​ అవుతోంది.

By

Published : Jul 20, 2021, 2:00 PM IST

boyfriend
బాయ్​ఫ్రెండ్​ కావాలని ప్రకటన

ఇప్పటివరకు ప్లాట్లు, ఉద్యోగాలు, వాణిజ్య ప్రకటనలే చూసిన మనకు ఈ ప్రకటన కాస్తా కొత్తగానే ఉంటుంది. అత్త కోసం బాయ్​ఫ్రెండ్​ను ఏర్పాటు చేయాలనుకున్న ఓ కోడలు ఏకంగా ఓ వైబ్​సైట్​లో ప్రకటన ఇచ్చేసింది.

విషయం ఏంటంటే..

అమెరికాలోని న్యూయార్క్​కు చెందిన ఓ కోడలు.. తన అత్తకు 40-60 ఏళ్ల మధ్య వయస్సున్న వారు రెండు రోజుల పాటు బాయ్​ ఫ్రెండ్​గా అద్దెకు కావాలని క్రెయిగ్స్​లిస్ట్​ అనే క్లాసిఫైడ్స్​ వెబ్​సైట్​లో ప్రకటన ఇచ్చింది. అది కాస్తా కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్​ అయ్యింది.

51 ఏళ్ల అత్తయ్యతో కాస్తా సమయం గడిపి, వారితో పాటు ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆ వ్యక్తి తోడుగా కావాలట. అందుకోసం 960 డాలర్లు (రూ.72వేలు) ఇస్తానని తెలిపింది.

అయితే అతడికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్​తో పాటు బాగా డాన్స్​ కూడా వచ్చి ఉండాలని షరతు విధించింది కోడలు. ఈ ప్రకటనపై చమత్కారంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.

ఇదీ చూడండి:ప్రియుడు చెప్పాడని.. ఆ పని చేసిన ప్రేయసి- చివరికి..

ABOUT THE AUTHOR

...view details