ఆంక్షల సడలింపుల తరువాత ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు కొవిడ్ బారినపడినవారి సంఖ్య 77 లక్షల 31 వేలు దాటింది. కాగా ఈ మహమ్మారి బారిన పడి 4 లక్షల 28 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వ్యాధి నుంచి 39 లక్షల 25 వేలకి పైగా బాధితులు కోలుకున్నారు.
కరోనా విజృంభణ.. 77 లక్షలు దాటిన కేసులు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తూనే ఉంది. అమెరికా, బ్రెజిల్, రష్యా, భారత్, యూకేలు వైరస్ ప్రభావానికి అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 77 లక్షల 31 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదు కాగా, 4 లక్షల 28 వేల మందికి పైగా మరణించారు. 39 లక్షల 25 వేల మంది బాధితులు కోలుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 77 లక్షలు దాటిన కరోనా కేసులు
మహమ్మారి ధాటికి అమెరికా, బ్రెజిల్, రష్యాలు అతలాకుతలం అవుతున్నాయి. భారత్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ దేశాల్లో కొవిడ్-19 వైరస్ మరింత వేగంగా విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మెక్సికోలో గడచిన 24 గంటల్లో కొత్తగా 5,222 కేసులు, 504 మరణాలు నమోదయ్యాయి. చైనాలో 11 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి:శాన్‌ఫ్రాన్సిస్కోలో కాన్సుల్ జనరల్‌గా తెలుగు అధికారి