చిలీలో మెట్రో టికెట్ రేట్లను పెంచడంపై ప్రజాగ్రహం హింసగా మారింది. పలు నగరాల్లో వరుసగా రెండో రోజు ప్రజలు నిరసనలు చేపట్టారు. కొన్ని మెట్రో స్టేషన్లను ధ్వంసం చేశారు. భారీగా బస్సులను తగలబెట్టారు.
అత్యయిక స్థితి..
గంట గంటకూ ప్రజల్లో ఆందోళనల స్థాయి పెరిగిపోవడం.. విధ్వంసం జరుగుతున్నందున.. అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు చిలీ అధ్యక్షుడు సెబాస్టియన్ పినేరా ప్రకటించారు. ఎమర్జెన్సీ విధించడానికి కారణం శాంతి భద్రతల పరిరక్షణ అని.. ప్రజల భద్రతే ముఖ్యమని పినేరా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.