తెలంగాణ

telangana

ETV Bharat / international

క్యూబా​ జూలో 4 'బంగాల్​ టైగర్'​ పిల్లల జననం! - begal tiger cubs

క్యూబా నేషనల్​ జూలో ఫియోనా అనే బంగాల్ టైగర్​.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పులి పిల్లల్లో ఒకటి నీలి రంగు కళ్లతో ఆకట్టుకుంటోంది. జూలో పులి పిల్లలు ఆడుకుంటున్న దృశ్యాలను అధికారులు విడుదల చేశారు.

Cuba's National Zoo
క్యూబా నేషనల్​ జూలో పులి పిల్లలు

By

Published : Apr 16, 2021, 9:16 PM IST

క్యూబా నేషనల్​ జూలో పులి పిల్లలు

క్యూబా జాతీయ జంతుప్రదర్శనశాలలో ఓ బంగాల్​ టైగర్​.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పిల్లల్లో ఒకటి పూర్తి తెలుపులో రంగులో ఉండటం విశేషం. మార్చి 12న ఫియోనా అనే పులి.. నాలుగు పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం.. 10 రోజుల పాటు వీటిని నిరంతర పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు.

ఈ పిల్లలకు తల్లి ఫియోనా కాగా.. తండ్రి గార్​ఫీల్డ్​ అనే మగ పులి. ఇప్పటివరకు ఈ పులి పిల్లలను ఎవరూ తాకనందున అవి ఆడవా? మగవా? అనే దానిపై స్పష్టత లేదు. వాటి బరువు ఎంతో కూడా ఎవరికీ తెలియదు. అయితే.. ఫియోనా ప్రసవించేటప్పుడు గమనించిన పులుల సంరక్షులకు.. ఆ పిల్లల్లో ఒకటి పూర్తి తెలుపు రంగు తోలుతో, నీలి రంగు కళ్లతో ఉన్నట్లు తెలిసింది.

ఆరునెలల తర్వాత..

ఇంకో ఆరు నుంచి ఏడు నెలల తర్వాత ఈ పులి పిల్లలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ప్రపంచవ్యాప్తంగా 200 తెల్లపులులు మాత్రమే ఉన్నాయి. 300 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న క్యూబా జాతీయ పార్కులో 1,400 జంతువులు ఉన్నాయి.

ఇదీ చూడండి:'చైనాతో సహకారం కంటే సంఘర్షణకే అమెరికా మొగ్గు'

ABOUT THE AUTHOR

...view details