తెలంగాణ

telangana

ETV Bharat / international

నాలుగు పెట్టెల చుట్టల ఖరీదు రూ.34 కోట్లు!

క్యూబా చుట్టలకు ఈ సారి వేలంలో భారీ ధర పలికింది. అత్యంత నాణ్యమైన చుట్టల తయారీకి పేరొందిన క్యూబాలో ఏటా సిగార్​ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జరిగిన వేలంలో నాలుగు పెట్టెల చుట్టలకు రూ.34 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.

CUBA CIGAR
క్యూబా చుట్టలు

By

Published : Feb 29, 2020, 4:33 PM IST

Updated : Mar 2, 2020, 11:24 PM IST

క్యూబా సిగార్ ఉత్సవం

క్యూబా అంతర్జాతీయ సిగార్ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన చుట్టల వేలంలో రికార్డు ధర పలికింది. 4.27 మిలియన్​ యూరోలు (రూ. 34 కోట్లు) పెట్టి చుట్టలను కొనుగోలు చేశారు ఔత్సాహికులు. ఈ మొత్తాన్ని ఆర్థిక సంక్షోభంలో ఉన్న క్యూబా ఆరోగ్య శాఖకు అందించనున్నారు.

హాంకాంగ్​కు చెందిన చైనా పెట్టుబడిదారుల బృందం.. అత్యంత నాణ్యమైన చుట్టలున్న రెండు పెట్టెలను వేలంలో దక్కించుకున్నాయి. ఒక పెట్టెకు 2.4 మిలియన్​ యూరోలు, మరొకదానిపై 3.2 లక్షల యూరోలు ఖర్చుపెట్టారు. యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​కు చెందిన కలెక్టర్ల బృందం మరో రెండు పెట్టెలను 7 లక్షల యూరోలు పెట్టి వేలంలో దక్కించుకున్నాయి.

ఈ సారే అధికం...

క్యూబాలో ఏటా సిగార్​ ఉత్సవం జరుగుతుంది. అయితే ఈ సారి వేలంలో భారీగా ఖర్చు పెట్టి చుట్టలను దక్కించుకున్నారు ఔత్సాహికులు. ఏటా సగటున 20 లక్షల యూరోలకు మించి ఇక్కడ వ్యాపారం జరగదు. కానీ ఈ ఏడు దానికి రెండింతలు దాటింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో క్యూబా ఆరోగ్య శాఖ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది.

భారీ డిమాండ్​..

క్యూబా చుట్టలు అత్యంత నాణ్యమైనవిగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. వీటికి ఆసియా, పశ్చిమాసియా, ఐరోపాల్లో భారీ డిమాండ్​ ఉంది.

ఇదీ చూడండి:ఆ దేశంలో 40 శాతం మంది ఊబకాయులే..

Last Updated : Mar 2, 2020, 11:24 PM IST

ABOUT THE AUTHOR

...view details