తెలంగాణ

telangana

ETV Bharat / international

'కాంగ్రెస్​లో బైడెన్​ గెలుపును సవాలు చేస్తాం' - అమెరికా కాంగ్రెస్​

ఎలక్టోరల్​ కాలేజీ​ ఫలితాలను ధ్రువీకరించేందుకు వచ్చే వారం అమెరికా కాంగ్రెస్​ సమావేశంకానున్న తరుణంలో 11మంది సభ్యుల రిపబ్లికన్​ సెనేటర్ల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. పలు రాష్ట్రాల ఎలక్టార్స్​కు వ్యతిరేకంగా ఓట్లు వేసి జో బైడెన్​ గెలుపును సవాలు చేస్తామని ప్రకటించింది.

Cruz leads 11 GOP senators challenging Biden win over Trump
'అమెరికా కాంగ్రెస్​లో బైడెన్​ గెలుపును సవాలు చేస్తాం'

By

Published : Jan 3, 2021, 5:30 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి.. జో బైడెన్​ను అధ్యక్షుడిగా ఎలక్టార్స్​ ఎన్నుకుని వారాలు గడిచిపోతున్నాయి. అయినా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన ఓటమిని అంగీకరించడం లేదు. తాజాగా.. 11మంది సభ్యుల రిపబ్లికన్​ సెనేటర్ల బృందం.. అధ్యక్షుడికి మద్దతుగా నిలుస్తూ.. బైడెన్​ గెలుపును అమెరికా కాంగ్రెస్​లో సవాలు చేయనున్నట్టు ప్రకటించింది.

ఎలక్టొరల్​ కాలేజీ ఫలితాలను ధ్రువీకరించేందుకు వచ్చే వారం అమెరికా కాంగ్రెస్​ సమావేశంకానుంది. ఈ సమావేశాల్లో పలు రాష్ట్రాల ఎలక్టార్స్​కు వ్యతిరేకంగా ఓట్లు వేసి బైడెన్​ ఎన్నికను సవాలు చేస్తామని ఈ బృందం వెల్లడించింది. ఎన్నికల ఫలితాలపై ఆడిట్​ నిర్వహించేందుకు ఎలక్టోరల్​ కమిషన్​ను తక్షణమే ఏర్పాటు చేయకపోతే తమ ప్రణాళికను కచ్చితంగా అమలు చేస్తామని తేల్చిచెప్పింది.

రిపబ్లికన్లలో చీలక..!

ఎన్నికల వ్యవహారంలో రిపబ్లికన్లలో చీలిక ఏర్పడినట్టు కనపడుతోంది. టెక్సాస్​ రిపబ్లికన్​ సెనేటర్​ టెడ్​ క్రుజ్​ నేతృత్వంలోని బృందం.. బైడెన్​ గెలుపును సవాలు చేస్తోంది. అయితే ఇలాంటి చర్యలు మానుకోవాలని సెనేట్​ మెజారిటీ నేత మిచ్​ మెక్కొన్నెల్​ అభ్యర్థించారు.

అయితే తాజా పరిణామాలు బైడెన్​కు పెద్దగా కష్టాలు తీసుకురావు. 306-232 తేడాతో ఈ నెల 20న ఆయన అధికారికంగా అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.

ఇదీ చూడండి:-'బైడెన్ ప్రభుత్వం వైఖరి మార్చుకుంటుంది'

ABOUT THE AUTHOR

...view details