వెనెజువెలా రోడ్లు శనివారం కిక్కిరిశాయి. రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన దేశంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఒకరు ప్రయత్నిస్తుంటే.. అదే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మరొకరు మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఇరు నేతల ర్యాలీలతో రాజధాని కారకస్ హోరెత్తింది.
ఈ ఏడాది జనవరిలో తానే దేశాధ్యక్షుడినని ప్రకటించుకున్న ప్రతిపక్ష నేత జువాన్ గుయాడో... మద్దతుదారులతో కారకస్ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. గుయాడోకు అమెరికా మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే.
చట్టసభ్యుడిగా తనకు మంజూరు చేసిన భద్రతను తొలగించిన తర్వాత తొలిసారి గుయాడో ప్రజల్లోకి వచ్చారు. మదురో అధికారాన్ని వీడే వరకు ఐక్యంగా పోరాడాలని వెనెజువెలా వాసులను పిలుపునిచ్చారు.
పోటీగా మరో ర్యాలీ...