అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జిల్లా కోర్టు నేర దర్యాప్తునకు ఆదేశించింది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు బుధవారం నోటీసులు జారీ చేసింది. దర్యాప్తునకు అధికారులు అన్ని విధాల సహకరిస్తారని ఆశిస్తామని కోర్టు నోటీసుల్లో పేర్కొంది.
ఎన్నికల వేళ ట్రంప్, జార్జియా రాష్ట్ర మంత్రి బ్రాడ్ రాఫెన్స్పెర్జర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇటీవల బహిర్గతమైంది. ఇప్పటికే అభిశంసన ప్రక్రియతో సతమతమవుతున్న ట్రంప్‌నకు ఈ చర్య గుదిబండగా మారింది.