జీవాలపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ శునకం, పిల్లిని తప్ప ఇతర జంతువులను కారులో షికారుకు తీసుకెళ్లలేం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా మూడు ఆవులను కారులో తీసుకెళ్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అవాక్కయ్యా..!
అమెరికాలోని విస్కాన్సిన్‌లో నివసించే జెస్సికా నెల్సన్ అనే మహిళ కారులో వెళుతుండగా మెక్‌డొనాల్డ్స్ ఎదురుగా నిలిపి ఉంచిన కారులో ఓ ఆవు ఉండటాన్ని గమనించింది. దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయదా అది వైరల్గా మారింది.
మొదట కారులో ఆవును చూసి నమ్మలేకపోయనని నెల్సన్ తెలిపింది. అయినా.. కారులో ఆవులను ఎవరు ఎక్కించుకెళ్తారులే? అనుకున్నానని, అది ఆవు బొమ్మ అని భ్రమపడినట్లు తెలిపింది. అయితే.. ఆవు తల కదిలించడం వల్ల నమ్మకతప్పలేదని తెలిపింది.