తెలంగాణ

telangana

ETV Bharat / international

us covishield: 'కొవిషీల్డ్‌ తీసుకున్నవారికే అమెరికాలోకి అనుమతి'

తమ దేశంలోకి విమాన ప్రయాణాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది అమెరికా. భారత్​ నుంచి కొవిషీల్డ్ తీసుకున్నవారికి మాత్రమే అమెరికాలోకి అనుమతించనున్నట్లు తెలిపింది.

us covishield
అమెరికా

By

Published : Sep 22, 2021, 6:09 AM IST

కరోనా టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిబంధనకు లోబడి భారత్‌ సహా 33 దేశాల వారు తమ దేశంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. మన దేశంలో తయారైన టీకాల్లో కొవిషీల్డ్‌ తీసుకున్న వారినే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత శ్వేత సౌథం మరో ప్రకటన చేస్తూ.. ఏ టీకా ఆమోదయోగ్యమో తుది నిర్ణయం తీసుకొనేది తమ దేశ 'వ్యాధుల నియంత్రణ కేంద్రం' (సీడీసీ) మాత్రమేనని పేర్కొంది.

డబ్ల్యూహెచ్‌వో ఇప్పటి వరకు ఏడు టీకాలను మాత్రమే గుర్తించింది. వాటిలో మోడెర్నా, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్‌(ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా ఫార్ములా), చైనాకు చెందిన సినోఫార్మ్‌, సినోవాక్‌ టీకాలు ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధిపరిచిన కొవాగ్జిన్‌ టీకాకు ఈ నెలలో డబ్ల్యూహెచ్‌వో అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

అక్టోబరులో 22 కోట్ల డోసులు..

తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని, వచ్చే నెలలో సుమారు 22 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది.

ఇదీ చూడండి:Covishield Vaccine: 66 కోట్ల డోసుల కొవిషీల్డ్‌ కోసం ఆర్డర్లు

ABOUT THE AUTHOR

...view details