రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అత్యంత పెద్ద సవాలు కరోనా మహమ్మారి అన్నారు ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గుటెర్స్.
ఐరాస చరిత్రలో చూడలేదు!
'75ఏళ్ల ఐక్యరాజ్యసమితి చరిత్రలో ఎన్నడులేని విధంగా ప్రపంచం ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తీవ్ర స్థాయిలో కరోనా వ్యాప్తి చెంది ప్రజల ప్రాణాలు ఉసురుతీస్తుంది' అని గుటెర్స్ పేర్కొన్నారు. ఆరోగ్య సంక్షోభం మానవ సంక్షోభానికి దారితీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్-19 సామాజిక-ఆర్థిక అంశాలపై చూపే ప్రభావాన్ని సూచిస్తూ 'షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, గ్లోబల్ సాలిడారిటీ' పేరిట ఓ విడుదల చేశారు.
అందురూ ఒక్కటై పోరాడాలి!
"ఆరోగ్య, ఆర్థిక సంక్షోభాలు ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయి. అస్థిరత, అశాంతి, వివాదాలకు దారితీస్తున్నాయి. ఈ తరుణంలో రాజకీయాలను పక్కన పెట్టి అందరూ ఒకే తాటిపైకి వచ్చి పూర్తి శక్తి సామర్థ్యాలతో వైరస్ను ఎదుర్కొవాలి" అని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు గుటెర్స్. మహమ్మారి కరోనాను ఎదుర్కోవడానికి ప్రపంచంలోని దిగ్గజ ఆర్థిక వ్యవస్థలన్నీ ఒక్కటై సమన్వయ, నిర్ణయాత్మక, వినూత్న, సమగ్ర విధానాలతో చర్యలు చేపట్టాలన్నారు. ధనిక దేశాలు.. పేద ప్రజలు, దేశాలకు ఆర్థిక, సాంకేతిక మద్దతు ఇవ్వాలని కోరారు ఐరాస అధ్యక్షుడు.