తెలంగాణ

telangana

ETV Bharat / international

కుమారుడిని కారు డిక్కీలో బంధించిన తల్లి- కొవిడ్​ సోకిందని.. - టెక్సాస్ కొవిడ్ న్యూస్

Covid in Texas: ఓ మహిళ తన కుమారుడిని కారు డిక్కీలో బంధించి కొవిడ్​ టెస్టుకు తీసుకెళ్లింది. తనకు వైరస్​ సోకకుండా ఈవిధంగా చేసినట్లు ఆమె తెలిపింది. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు చేశారు అధికారులు. ఈ ఘటన అమెరికాలో జరిగింది.

car
కారు

By

Published : Jan 8, 2022, 6:14 PM IST

Covid in Texas: అమెరికాలో కొవిడ్‌ కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. మరోవైపు స్థానికులు పెద్దఎత్తున కరోనా పరీక్షలకు బారులు తీరుతున్నారు. ఇదే క్రమంలో ఓ మహిళ.. పాజిటివ్‌గా తేలిన తన కుమారుడికి మరోసారి టెస్టు కోసం కారు డిక్కీలో బంధించి తీసుకురావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తాను వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు ఆమె పేర్కొనడం గమనార్హం.

ఇదీ జరిగింది..

టెక్సాస్‌కు చెందిన సారా బీమ్‌ ఉపాధ్యాయురాలు. ఇటీవల హారిస్ కౌంటీలోని డ్రైవ్-త్రూ టెస్టింగ్ కేంద్రానికి వచ్చారు. అయితే, ఆమె కారు డిక్కీలోంచి మాటలు రావడం గమనించిన ఓ మహిళ.. అక్కడున్నవారికి తెలిపారు. వారు ఈ విషయమై బీమ్‌ను నిలదీశారు. దీంతో ఆమె డిక్కీ తీయగా.. అందులోంచి 13 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. దీంతో కంగుతిన్న వారు అధికారులకు సమాచారం ఇచ్చారు.

అతను తన కుమారుడని.. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడం వల్ల, మరోసారి నిర్ధారణ కోసం పరీక్ష చేయించేందుకుగానూ తీసుకొచ్చినట్లు ఆమె అధికారులకు చెప్పారు. ఈ క్రమంలో తనకు వైరస్‌ సోకకుండా ఉండేందుకే ఇలా చేసినట్లు తెలిపారు. అయితే, అతన్ని కారు వెనుక సీటులో కూర్చోబెట్టుకునేవరకు టెస్టు నిర్వహించబోమని ఆ పరీక్ష కేంద్రం సిబ్బంది ఆమెకు స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు.. పూర్తి విచారణ జరిపారు. బాలుడి ప్రాణానికి అపాయం కలిగేలా వ్యవహరించారన్న అభియోగాలపై ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు అతనికి ఏం కాలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:

'కొవిడ్​ తదుపరి వేరియంట్‌ అత్యంత ప్రమాదకరం కావొచ్చు!'

మంచువర్షం.. కార్లలోనే ఇరుక్కుపోయి 16 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details