ప్రపంచవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కొద్దిరోజులుగా సగటున రోజుకు రెండు లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు 3కోట్ల 13లక్షలమంది వైరస్ బారినపడ్డారు. వారిలో 9లక్షల 66వేల మందికిపైగా మరణించారు. అయితే.. పెరుగుతున్న కేసులకు అనుగుణంగానే రికవరీ రేటు కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు 2కోట్ల 29లక్షలమందికి పైగా మహమ్మారిని జయించారు. 74లక్షల మందికిపైగా వైరస్‌తో పోరాడుతున్నారు.
- కొవిడ్ కేసులపరంగా అగ్రస్థానంలో ఉన్న అమెరికాలో ఇప్పటివరకు 70.16లక్షల మందికి వైరస్ సోకింది. వారిలో 2.04లక్షల మందికిపైగా మృతిచెందారు.
- బ్రెజిల్లో కేసుల సంఖ్య 45.47 కేసులు నమోదుకాగా.. 1.36లక్షల మరణాలు సంభవించాయి.
- పాక్‌లో సోమవారం ఒక్కరోజే 633 మందికి వైరస్ సోకింది. కేసుల సంఖ్య 3,06,304కు చేరింది. మరో నలుగురు చనిపోవడం వల్ల.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 6,420కు పెరిగింది.
- నేపాల్‌లో కొత్తగా 1,154 కొవిడ్ కేసులు వెలుగుచూడగా.. బాధితుల సంఖ్య 65,276కు ఎగబాకింది. ఆ దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో 16మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 427కు చేరింది.
'చర్యలు తీసుకోకపోతే రోజుకు 50వేల కేసులు!'
బ్రిటన్‌లో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో.. కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు అక్కడి వైద్యాధికారులు. దేశంలో కరోనా విజృంభణ ఇలాగే కొనసాగితే రోజుకు 50వేల కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. దీంతో మరణాల సంఖ్య కూడా మరింత అధికమవుతుందన్నారు.