తెలంగాణ

telangana

By

Published : Mar 14, 2021, 10:30 AM IST

ETV Bharat / international

'కొత్త కరోనాపై కొన్ని టీకాల పనితీరు అంతంతే!'

ఇటీవల వెలుగులోకి వస్తున్న కొత్త రకం కరోనా వైరస్​లపై వ్యాక్సిన్ల ప్రభావం అంతంతమాత్రంగానే ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వుహాన్​లో వెలుగులోకి వచ్చిన వైరస్​తో పోలిస్తే, ఈ కొత్త కరోనా రకాలు.. టీకాల ద్వారా విడుదలైన యాంటీబాడీలను అధికంగా ప్రతిఘటిస్తున్నాయని తెలిపారు.

COVID-19 vaccine-induced antibodies less effective against some coronavirus variants: Study
'కొత్త కరోనాపై కొన్ని టీకాల పనితీరు అంతంతే'

కొత్తరకం కరోనా వైరస్‌లను నియంత్రించడంలో కొన్ని వ్యాక్సిన్ల పనితీరు అంతంత మాత్రంగానే ఉన్నట్టు తాజా పరిశోధనలో తేలింది. మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తలు దీన్ని చేపట్టారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, జపాన్‌ రకాల వైరస్‌లపై ఫైజర్‌, మోడెర్నా టీకాల పనితీరు ఎలా ఉందన్న విషయమై వారు పరిశోధన సాగించారు. వైరస్‌ రూపాన్ని గుర్తించి దాన్ని చిక్కించుకునేలా యాంటీబాడీ ఆకృతి ఉంటేనే.. మహమ్మారి నియంత్రణలోకి వస్తున్నట్టు గుర్తించారు. స్పైక్‌ ప్రొటీన్‌ రూపంలో ఏమాత్రం తేడా ఉన్నా.. ప్రతినిరోధకాలు వాటిని బంధించలేకపోతున్నట్టు తేల్చారు.

"మొట్టమొదట వెలుగుచూసిన వుహాన్‌ వైరస్‌తో పోల్చితే- ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్ల ద్వారా విడుదలైన యాంటీబాడీలను దక్షిణాఫ్రికా రకం మహమ్మారి 20-40 సార్లు; బ్రెజిల్‌, జపాన్‌ రకాల వైరస్‌లు 5- సార్లు ఎక్కువగా ప్రతిఘటిస్తున్నాయి. స్పైక్‌ ప్రొటీన్‌లోని మార్పుల కారణంగానే వీటికి ఆ శక్తి వస్తోంది. అలాగని ఈ వ్యాక్సిన్లు కొవిడ్‌ను పూర్తిగా అరికట్టలేవని అనుకోనక్కర్లేదు. వైరస్‌ను గుర్తించడంలో యాంటీబాడీలకు ఇబ్బంది ఎదురవడం వల్లే ఇలా జరుగుతోంది. శరీర సహజ రోగనిరోధక శక్తి కూడా వీటికి తోడై కొవిడ్‌ను అడ్డుకునే వీలుంది" అని పరిశోధనకర్త విల్‌ఫెడో గార్సియా-బెల్ట్రాన్‌ వివరించారు. 'సెల్‌' పత్రిక ఈ వివరాలను అందించింది.

ఇదీ చదవండి:యాంటీబాడీలు పెరగకున్నా ఫర్వాలేదు... వ్యాక్సిన్‌తో ప్రయోజనమే!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details