తెలంగాణ

telangana

ETV Bharat / international

వీటికి జవాబు దొరికితేనే కరోనా వ్యాక్సిన్​ వచ్చేది! - Covid vaccine trails on ferrets, mice

కరోనా వ్యాక్సిన్​ కోసం యావత్​ ప్రపంచం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. మహమ్మారిని సమూలంగా సమాధి చేయగల టీకా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎన్నో ఆశలతో వైద్య పరిశోధకులకేసి చూస్తోంది. ఇందుకోసం పరిశోధకులు సైతం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వ్యాక్సిన్​ ట్రయల్స్​ చేసే సమయంలో శాస్త్రవేత్తల మదిలో మెదిలిన పలు సందేహాల కారణంగా... టీకా అభివృద్ధి ప్రక్రియ కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఆ ప్రశ్నలేంటి?

COVID-19 vaccine boils down to some critical questions
వీటికి సమాధానం దొరికితేనే కరోనా వ్యాక్సిన్​ వచ్చేది!

By

Published : Jun 9, 2020, 2:27 PM IST

ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ అభివృద్ధి చేసేందుకు చాలా మంది వైద్య శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకొచ్చి మహమ్మారి వైరస్​ను తరిమికొట్టాలని చూస్తున్నారు. అయితే ఒక వ్యక్తిలో వైరస్​పై వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేసేందుకు ఎంతమేర వ్యాక్సిన్​ ఇవ్వాలి? ఒకవేళ అది వికటిస్తే.. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశముందా? వంటి ప్రశ్నలు శాస్త్రవేత్తలను ఆలోచింపచేస్తున్నాయి. ఫలితంగా వ్యాక్సిన్​ ప్రయత్నాలు కాస్త నెమ్మదించినట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం పలు వ్యాక్సిన్లు ట్రయల్స్​ దశలో ఉన్నాయి. వీటిని కోతులు, ఫెర్రెట్లు (ముంగిసలాంటి జంతువు)తో పాటు ఇతర జంతువులపై ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు.

ఎన్నో ఫ్లూ వైరస్​లకు వ్యాక్సిన్​ అభివృద్ధిలో ఫెర్రెట్లు కీలకంగా వ్యవహరించాయి. అందుకే కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధిలోనూ వీటిపైనే ముందుగా ప్రయోగిస్తున్నారు. అయితే వ్యాక్సిన్​తో మానవ శరీరంలాగే స్పందించి జంతువులు కరోనాను అడ్డుకోగలవా? అని పరిశోధకుల మదిలో మరో ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే మనుషుల తరహాలో ఏ జంతువులోనూ కరోనా​ లక్షణాలు కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ వికటిస్తే పరిస్థితి ఏంటి అన్న కోణంలో ఎలుకలు, ఫెర్రెట్లు, కోతులపై ట్రయల్స్​ నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం జంతువులతో పాటు మనుషులపైనా ఏకకాలంలో పరీక్షిస్తున్నారు.

" మనిషిలో కనిపించే శ్వాసకోశ సంబంధిత సమస్యలను ఫెర్రెట్లలో గమనించాం. ఫెర్రెట్లకు కూడా జ్వరం, దగ్గు, తుమ్ములు వస్తాయి. తద్వారా అవి కూడా ఒక జంతువు నుంచి మరో జంతువుకు వైరస్​ను​ వ్యాప్తి చేసే అవకాశముంది. అందుకే మనుషులకు వ్యాక్సిన్​ అభివృద్ధి చేసేందుకు ఫెర్రెట్లు ఉపయోగపడతాయి."

- అలీసన్​ కెల్విన్​, కెనెడా డల్హౌహీ యూనివర్సిటీ శాస్త్రవేత్త

అయితే ఇటీవల ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం, చైనాకు చెందిన సినోవాక్​... కోతులపై జరిపిన పరిశోధనల్లో వేర్వేరు కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధి పద్ధతులను అనుసరించారు శాస్త్రవేత్తలు. ఇందులో ఏ పద్ధతిలోనూ వ్యాక్సిన్​ వల్ల కోతుల్లో దుష్ప్రభావాలు తలెత్తలేదు.

అయితే ఇక్కడ ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు మరో సందేహం వచ్చింది. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్​.. వైరస్​ వ్యాప్తిని అడ్డుకోగలదా? అన్న అనుమానం పరిశోధకుల మదిలో మెదిలింది.

కొవిడ్​-19 వైరస్​ జనకాలు ఉన్న మొత్తంలోనే వ్యాక్సిన్​ను అందిస్తే.. జంతువులకు కరోనా సోకకుండా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details