తెలంగాణ

telangana

ETV Bharat / international

వెంటిలేటర్​ షేరింగ్​తో కరోనా రోగులకు ప్రాణవాయువు! - కరోవా వైరస్ చికిత్స

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచ దేశాల్లో వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. ఈ పరికరాలు పరిమిత సంఖ్యలోనే ఉన్నా సరిపెట్టుకుంటున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు అమెరికాకు చెందిన పరిశోధకుల బృందం వెంటిలేటర్​ షేరింగ్​ విధానాన్ని రూపొందించారు. వాయునాళాలను విభజించి వాటికి వాల్వులు ఏర్పాటు చేసి ఆక్సిజన్ సరఫరా చేయొచ్చని సూచిస్తున్నారు.

COVID-19
వెంటిలేటర్​ షేరింగ్​

By

Published : May 22, 2020, 6:25 PM IST

కరోనా నేపథ్యంలో వెంటిలేటర్ల కొరతను తగ్గించేందుకు అమెరికా పరిశోధకులు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఒకే వెంటిలేటర్​తో చాలా మంది రోగులకు ప్రాణవాయువు అందించేలా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

చివరి ప్రయత్నంగా..

కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న బాధితులకు అత్యవసర పరిస్థితుల్లోనే ఈ విధానాన్ని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ బృందంలో అమెరికా పరిశోధకులతో పాటు భారత సంతతి వ్యక్తి శ్రియ శ్రీనివాసన్​ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం సైన్స్​ ట్రాన్స్​లేషనల్ మెడిసిన్​ అనే జర్నల్​లో ప్రచురితమైంది.

ప్రమాదకరం..?

చాలా వైద్య సంఘాలు ఈ విధానాన్ని విమర్శించారు. ప్రతి రోగికి తగిన మోతాదులో ఆక్సిజన్​ అందుతుందో లేదో చెప్పలేమని.. ఇది బాధితుల ప్రాణాలకే ముప్పుగా అభివర్ణించారు. అయితే మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకుల బృందం.. కొన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తే ఈ వెంటిలేటర్​ షేరింగ్​ను చక్కగా వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.

"వెంటిలేటర్​ షేరింగ్​ ప్రామాణికమైన చికిత్స కాదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించవచ్చు. వెంటిలేటర్​ వాయునాళాలను విభజించి వాల్వులను అమర్చితే.. ఒక్కో రోగికి అవసరమైన ఆక్సిజన్ స్థాయులను నిర్ధరించి సరఫరా చేయవచ్చు. రోగి ఆరోగ్య స్థితిని బట్టి వాల్వులను నియంత్రించుకొని ఆక్సిజన్​ను సరఫరా చేయవచ్చు. ఈ ఏర్పాట్లు చేసేందుకు ఆసుపత్రిలో లభించే సామగ్రి సరిపోతుంది."

- ఎంఐటీ పరిశోధకులు

ఇద్దరికి మించి వెంటిలేటర్​ షేరింగ్​ ఉపయోగించటం కొంత కష్టమేనని పరిశోధకులు అంటున్నారు. దీనిపై మరింత పరిశోధన తర్వాత ఈ విధానంలోని లోటుపాట్లు, ప్రయోజనాలు పూర్తిగా తెలుస్తాయన్నారు.

ఇదీ చూడండి:కరోనా ప్రభావం పెద్దలకన్నా పిల్లల్లోనే తక్కువ- ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details