తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​లోని శ్రమ జీవులకు అమెరికా ఆర్థిక సాయం - అమెరికా సాయం

భారత్​లో కరోనాతో సమస్యలు ఎదుర్కొంటున్న బలహీన వర్గాల జీవన విధానాన్ని మెరుగుపరచటం, స్థానిక ఆర్థిక వ్యవస్థల పునర్నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించనుంది అమెరికా. యూఎస్​ఏఐడీ ద్వారా అసంఘటిత రంగ కార్మికులు, సూక్ష్మ పరిశ్రమల కోసం 1.9 మిలియన్​ డాలర్లు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు భారత్​లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

US commits USD 1.9 mn to India
అసంఘటిత రంగ కార్మికులకు అమెరికా సాయం

By

Published : Oct 1, 2020, 5:34 PM IST

భారత్​లో కరోనా మహమ్మారి కారణంగా జీవనోపాధి కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులు, ఇతర బలహీన వర్గాలకు సాయం చేయాలని నిర్ణయించింది అమెరికా. అందుకోసం 1.9 మిలియన్​ డాలర్లు (13.90 కోట్లు) ఆర్థిక సాయం అందించనుంది.

అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ(యూఎస్​ఏఐడీ) ద్వారా ఈ సాయం అందిస్తున్నట్లు భారత్​లో అమెరికా రాయబారి కెన్నెత్​ ఐ జస్టర్​ తెలిపారు.

"నిరుద్యోగం, ఆదాయ అంతరాల వల్ల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంహిత కలెక్టివ్​ గుడ్​ ఫౌండేషన్​ నెలకొల్పిన 'రివైవల్​ అలయన్స్'​కు యూఎస్​ఏఐడీ నిధులు మద్దతుగా నిలుస్తాయి. స్వయం ఉపాధిదారులకు, నానో, సూక్ష్మ పరిశ్రమలు నిలదొక్కుకునేందుకు రుణాలు, గ్రాంట్స్​ రూపంలో తొలిదశలో 6.85 మిలియన్​ డాలర్లు అందించనుంది ఈ అలియన్స్​​."

-అమెరికా రాయబార కార్యాలయం

దేశంలోని సుమారు 60,000-1,00,000 వరకు కార్మికులు, చిన్న సంస్థలకు సాయం అందనుంది. ఇందులో ముఖ్యంగా యువత, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రివైవ్​ అలియన్స్​ ద్వారా యువత, కార్మికులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.

ఇదీ చూడండి: మహమ్మారుల్లో కరోనాతోనే అత్యధిక మరణాలు: ఐరాస

ABOUT THE AUTHOR

...view details