తెలంగాణ

telangana

ETV Bharat / international

'జీ-7 సదస్సు అమెరికా పునరుద్ధరణకు గొప్ప నిదర్శనం'

కరోనా విజృంభిస్తున్నా జీ-7 సదస్సును నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుబడుతున్నారు. ఆంక్షలు ఎత్తివేస్తున్న సమయంలో జీ-7 సదస్సు జరిగితే అమెరికా పునరుద్ధరణకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని ట్రంప్ భావిస్తున్నారు.

Trump
డొనాల్డ్ ట్రంప్

By

Published : May 27, 2020, 12:18 PM IST

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో జీ- 7 సదస్సు జరిగితే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు గొప్ప సాక్ష్యంగా నిలుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. జూన్ చివరివారం​లో నిర్వహించే ఈ అగ్రరాజ్యాల శిఖరాగ్ర సదస్సు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా అవకాశం ఉంది.

అభివృద్ధి చెందిన దేశాలు కలిసి జీ- 7 కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్​, జర్మనీ, ఇటలీ, జపాన్​, కెనడా సభ్యులుగా ఉన్నాయి. జీ- 7 దేశాల అధ్యక్షుల వార్షిక సదస్సు అమెరికాలో నిర్వహించాల్సి ఉంది. జీ- 7 సదస్సును ఎలాగైనా నిర్వహించాలని చాలా రోజులుగా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.

"అధ్యక్షుడు ట్రంప్ ఈ సదస్సు జరగాలని కోరుకుంటున్నారు. అమెరికా పునరుద్ధరణలో భాగంగా సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. సామాజిక దూరం పాటిస్తూనే కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నాం. ఈ సమయంలో జీ-7 సదస్సు జరిగితే అమెరికా పునరుద్ధరణకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అధ్యక్షుడు భావిస్తున్నారు. "

- కేలీ మెక్​ఎనానీ, శ్వేతసౌధ మీడియా కార్యదర్శి

సదస్సుకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రపంచనేతలతో జాతీయ భద్రత సలహాదారు రాబర్ట్ ఒబ్రెయిన్​ సంప్రదింపులు జరుపుతున్నట్లు కేలీ చెప్పారు. సదస్సుకు వచ్చే దేశాధినేతలకు అమెరికా అధ్యక్షుడి తరహాలో రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటన తర్వాత విదేశీ నేతలు సానుకూలంగా స్పందించినట్లు కేలీ తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా వేళ జీ-7 సదస్సుకు సిద్ధమన్న ట్రంప్‌

ABOUT THE AUTHOR

...view details