ప్రపంచ దేశాలను కుదుపేసిన కరోనా మహమ్మారి కారణంగా.. సుమారు 15 నుంచి 17.5 కోట్ల మంది తీవ్ర పేదరికం అనుభవించే అవకాశముందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వర్చువల్గా జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు మానవ హక్కుల ప్రత్యేక రిపోర్టర్ ఆలివర్ డీ ష్కట్టర్.
తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయేవారిలో.. అసంఘటిత రంగం వారే ఎక్కువగా ఉంటారని చెప్పారు ఆలివర్. వారిలో మహిళలే అధికమని అంచనా వేశారు. పర్యావరణంపై ఆధారపడి జీవనోపాధి సాగించేవారు ఎక్కువగా ప్రభావితమవుతారని ఆయన స్పష్టం చేశారు.