తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 8.5కోట్లు దాటిన కరోనా కేసులు - 5.1 lakhs news cases around world

కొవిడ్​​ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఒక్కరోజే 5.1లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం సంఖ్య 8కోట్ల 55లక్షలకు పెరిగింది. కొత్తగా మరో 7,099 మంది మరణాలతో.. మృతుల సంఖ్య 1.08 కోట్లకు చేరింది.

covid-19 tally crosses 8.55 crore mark with over 5.1 lakhs news cases
ఎనిమిదిన్నర కోట్లు దాటిన కరోనా కేసులు

By

Published : Jan 4, 2021, 11:24 AM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​ పంజా విసురుతూనే ఉంది. తాజాగా 5.1 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. 7,099 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 8కోట్ల 55లక్షల కేసులు నమోదయ్యాయి. ఒక కోటి 8లక్షల 50వేల మరణాలు సంభవించాయి. 2 కోట్ల 31లక్షల 98 వేల క్రియాశీల కేసులు ఉన్నాయి. 6 కోట్ల 4 లక్షల 54 వేల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

  • మొత్తం కేసులు: 85,504,375
  • మరణాలు: 1,850,646
  • కోలుకున్నవారు: 60,454,731
  • క్రియాశీల కేసులు: 23,198,998
  1. అమెరికాలో వాక్సిన్​ పంపిణీ జరుగుతుండగా.. మరోవైపు కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా లక్షా 94వేల కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 2.11 కోట్లకు చేరింది. తాజాగా మరో 1387 మంది మృతితో, మరణాల సంఖ్య 3.6 లక్షలకు పెరిగింది.
  2. యూకేలోనూ కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 54 వేల కొత్త కేసులు నమోదు కాగా.. 454 మంది మరణించారు.
  3. రష్యాలో తాజాగా 24,150 కొత్త కేసులు నమోదయ్యాయి. 504 మంది కొవిడ్​ ధాటికి మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 32 లక్షలుగా నమోదయ్యాయి.
  4. బ్రెజిల్​లో 17,341 కొత్త కేసులు నమోదయ్యాయి. 276 మంది మరణించారు. మొత్తం కేసులు 77లక్షల 33వేలకు పెరిగాయి. కేసుల సంఖ్య పరంగా భారత్​ తర్వాతి స్థానంలో ఉన్న బ్రెజిల్​.. మరణాలు మాత్రం ఇక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటివరకు లక్షా 96వేల మరణాలు సంభవించాయి.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు
అమెరికా 21,113,528 360,078
బ్రెజిల్ 7,733,746 196,018
రష్యా 3,236,787 58,506
ఫ్రాన్స్ 2,655,728 65,037
యూకే 2,654,779 75,024

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details