ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకరోజు వ్యవధిలో ఐదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 8వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 16,27,263కు చేరింది.
- మొత్తం కేసులు:7,31,72,621
- యాక్టివ్ కేసులు:2,025,4,085
- కొత్తగా నమోదైన కేసులు:5,19,564
- మొత్తం మరణాలు:16,27,263
- అమెరికాలో కరోనా విలయం అదే స్థాయిలో కొనసాగుతోంది. లక్ష 91 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 1533 మంది బాధితులు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,69,35,726కు పెరగ్గా.. మరణాల సంఖ్య మూడు లక్షల 8 వేలకు ఎగబాకింది.
- బ్రెజిల్లో 27 వేల కేసులు బయటపడ్డాయి. మరో 526 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో కొత్తగా 27,328 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 450 మంది మరణించారు.