ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకరోజు వ్యవధిలో మూడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మరో 6 వేల మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య పది లక్షల 18 వేలకు చేరింది. మొత్తం కేసుల సంఖ్య మూడు కోట్ల 41 లక్షలు దాటింది.
- మొత్తం కేసులు:3,41,46,558
- యాక్టివ్ కేసులు:77,18,226
- కొత్తగా నమోదైన కేసులు:3,12,433
- మొత్తం మరణాలు:10,18,193
అమెరికాలో కరోనా విలయం అదే స్థాయిలో కొనసాగుతోంది. 40 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 953 మంది బాధితులు మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 74.47 లక్షలకు పెరగ్గా.. మరణాల సంఖ్య రెండు లక్షల 11 వేలకు ఎగబాకింది.
బ్రెజిల్లో 33 వేల కేసులు బయటపడ్డాయి. మరో 952 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కొత్తగా 8,481 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 177 మంది మరణించారు.