కరోనా మహమ్మారి సోకి ప్రాణాలతో బయటపడినప్పటికీ 6 నెలల పాటు ఎప్పుడైనా పరిస్థితి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని అమెరికాకు చెందిన వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయం తెలిపింది. కరోనా సోకినప్పుడు ఆస్పత్రుల్లో చేరేంతగా ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ.. తదుపరి 6 మాసాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు జర్నల్ నేచర్‌లో గురువారం కథనం ప్రచురితమైంది. ఆ కథనం ప్రకారం.. భవిష్యత్తులో కొన్నేళ్ల పాటు ప్రపంచ జనాభాపై మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు రూపొందించిన కొవిడ్-19 అనుబంధ రోగాల పట్టిక పరిశీలిస్తే.. కరోనా వల్ల కలిగే దీర్ఘ కాలిక సమస్యల గురించి వెల్లడవుతుందని జర్నల్ తెలిపింది. ప్రస్తుతానికి శ్వాసకోశ వ్యవస్థపై వైరస్ ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. దీర్ఘకాలంలో శరీరంలోని ప్రతి అవయవాన్ని మహమ్మారి ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్ల నుంచి రక్షణ ఎంతకాలం?
87వేల మందిపై..
సుమారు 87 వేల మంది కొవిడ్-19 రోగులతో పాటు 50 లక్షల మంది కంట్రోల్ పేషెంట్లపై పరిశోధన చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా చికిత్స తీసుకున్న 6 మాసాల తర్వాత కూడా చిన్నపాటి కొవిడ్ లక్షణాలతో మహమ్మారి బారినపడిన వారితో సహా.. అందరికీ ప్రాణాపాయం పొంచి ఉంటుందని పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త జియాద్ అల్ అలై తెలిపారు. కొవిడ్-19 బారినపడి కోలుకున్న తమ రోగుల ఆరోగ్యంపై వైద్యులు కొద్ది మాసాల పాటు పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ఆ రోగులకు.. సమీకృత, బహుముఖ చికిత్స అవసరమని సూచించారు. కొవిడ్-19 బారిన పడిన వారిపై కొద్దివారాల పాటు.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి మహమ్మారి వల్ల కలిగే ప్రమాదాన్ని అంచనా వేసినట్లు అలై స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'కొవిడ్‌పై పోరులో భారత్‌కు అండగా ఉంటాం'
6 నెలల్లోపు 65 శాతం ఎక్కువ..