ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల కరోనా కేసులు - ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు
ప్రపంచ దేశాలపై కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో దాదాపు 2 లక్షల 31వేల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 2 కోట్ల 72 లక్షలు దాటింది. మహమ్మారి కారణంగా మరో 4వేల మందికిపైగా చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 8 లక్షల 87 వేలకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 2.31 లక్షల మందికిపైగా కరోనా
By
Published : Sep 7, 2020, 9:16 AM IST
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ 2 కోట్ల 72 లక్షల మందికిపైగా మహమ్మారి సోకింది. తాజాగా 2 లక్షల 31వేలకు పైగా కొత్త కేసుల బయటపడ్డాయి. మరో 4,129 మంది వైరస్‌తో ప్రాణాలు విడిచారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 8.87 లక్షలకు పెరిగింది.
కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు 1.93 కోట్ల మంది కోలుకున్నారు. మరో 70 లక్షల 29వేల యాక్టివ్ కేసులున్నాయి.
మొత్తం కేసులు : 27,283,718
మొత్తం మరణాలు : 887,305
యాక్టివ్ కేసులు : 7,029,248
రికవరీలు : 19,367,165
అమెరికా, బ్రెజిల్‌లలో తగ్గుముఖం
అమెరికాలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా 31,110 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 64,60,250కి చేరింది. మరో 432 మంది వైరస్ కారణంగా చనిపోగా.. మృతుల సంఖ్య 1,93,250కి పెరిగింది.
బ్రెజిల్‌లోనూ కరోనా శాంతించినట్లుగా ఉంది. తాజాగా 14,606 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ కాగా.. మొత్తం కేసుల సంఖ్య 41,37,606కు ఎగబాకింది. మహమ్మారి ధాటికి మరో 456 మంది బలవ్వగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,26,686కు చేరింది.