తెలంగాణ

telangana

ETV Bharat / international

విమానయానం కంటే బయటే కరోనా ముప్పు ఎక్కువ!

విమాన ప్రయాణం చేస్తే కరోనా ముప్పు ఎక్కువని భావిస్తున్నారా? కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చేసే ప్రయాణాలతో పోలిస్తే.. రెస్టారెంట్లలో తినడం, షాపింగ్​ చేయడం వల్లే మహమ్మారి సోకేందుకు ఎక్కువ అవకాశముందట.

By

Published : Nov 1, 2020, 5:22 PM IST

corona latest news
విమాన ప్రయాణం కంటే బయటే కరోనా ముప్పు ఎక్కువ!

జాగ్రత్తలు పాటిస్తూ విమానంలో ప్రయాణాలు చేసేవారి కంటే రెస్టారెంట్లలో తినేవారు, కిరాణా సామాన్ల కోసం దుకాణాలకు వెళ్లే వారికే.. కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు హార్వర్డ్‌ పరిశోధకులు వెల్లడించారు. హార్వర్డ్ టీహెచ్‌ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన శాస్త్రవేత్తలు.. ఏవియేషన్ పబ్లిక్ హెల్త్‌ ఇనీషియేటివ్‌ పేరుతో ప్రచురించిన అధ్యయనంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. నివారణ చర్యలు పాటించేలా ప్రయాణికులను ప్రోత్సహిస్తే కొవిడ్-19 సంక్రమణ రేటు చాలా వరకు తగ్గిపోతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, అన్నివేళలా మాస్కులు ధరించడం, విమానాశ్రయాల్లో వెంటిలేషన్ సౌకర్యంతో పాటు శానిటైజ్ చేయడం వంటి మార్గదర్శకాలను అనుసరించాలని అధ్యయనం పేర్కొంది. వైరస్‌ కట్టడిలో విద్య, అవగాహన కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details