తెలంగాణ

telangana

ETV Bharat / international

లాక్​డౌన్​తో వారికి మేలే జరిగింది!

కరోనా మహమ్మారి విధ్వంసం కారణంగా సమాజంలోని అన్ని వర్గాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి, సామాజిక మద్దతు తగ్గింది. సరికొత్త ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొత్తగా తల్లిదండ్రులైన వారిపై లాక్​డౌన్ సానుకూల ప్రభావం చూపిందని ఓ అధ్యయనం తెలిపింది. చిన్నపిల్లలు గల భార్యభర్తల మధ్య బంధం మరింత బలపడినట్లు పేర్కొంది.

covid-19-pandemic-may-not-only-have-negative-consequences-for-parents-with-a-newborn
కొత్త తల్లిదండ్రులైన వారిపై లాక్​డౌన్​ సానుకూల ప్రభావం!

By

Published : Jul 10, 2021, 4:35 PM IST

కొవిడ్​-19 ఎన్నో కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కుటుంబ భారం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తల్లిదండ్రులు మానసిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొందరికి మద్యం అలవాటు పెరిగిందని, ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే కరోనా లాక్​డౌన్.. కొత్తగా తల్లిదండ్రులైన వారిపై సానుకూల ప్రభావం చూపించిందని.. కెనడాలోని ఓ యూనిర్సిటీ అధ్యయనం వెల్లడించింది. గతంతో పొల్చితే నవజాత శిశువులు గల భార్యభర్తల మధ్య బంధం మరింత బలపడిందని సర్వే ద్వారా పేర్కొంది. జీవితం సంతోషంగా, సంతృప్తికరంగా సాగుతుందనే అభిప్రాయాన్ని ఎక్కువగా తెలిపినట్లు స్పష్టం చేసింది.

6 నెలల వరకు వయసున్న శిశువులు గల 1,900 మంది తల్లిదండ్రులపై 2018 నుంచి ఈ సర్వే నిర్వహించారు.

సర్వేలో వెల్లడైన విషయాలు..

  • కరోనాకు ముందు(2019)తో పోల్చితే లాక్​డౌన్​ తర్వాతే ఈ తల్లిదండ్రుల జీవితం ఆనందంగా సాగుతోంది.
  • భార్యాభర్తలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడపటం వల్ల ఇద్దరి మధ్య దూరం తగ్గింది.
  • పిల్లలతో అనుబంధం పెరిగినట్లు ఎక్కువ మంది తండ్రులు తెలిపారు.
  • భర్తతో బంధం దృఢమైందని, చిన్నారికి తల్లిగా ఉండటం వల్ల జీవితం సంతృప్తికరంగా ఉందని మహిళలు చెప్పారు.
  • పిల్లల బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామనే భావన తల్లుల్లో కాస్త తగ్గింది. అయితే 45శాతం తల్లుల ఇళ్లలో తమ బంధువుల పిల్లలు కూడా ఉండటం వల్ల చదువు వ్యవహారాలు చూసుకొని వారిపై భారం పెరగడమే ఈ భావనకు కారణం.
  • కొత్తగా తల్లైన వారు ఐసోలేషన్లో ఉండటం వల్ల ఇతర కుటుంబసభ్యుల నుంచి సలహాలు, సూచనలు లేక పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతున్నామనే అభద్రతా భావం వారు వ్యక్తం చేశారు.
  • మొత్తానికి లాక్​డౌన్​లో ఇంట్లో ఉండటం వల్ల తల్లిదండ్రులకు మేలు జరిగింది. ఇతర సవాళ్లు ఉన్నప్పటికి వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు.

ఇదీ చూడండి: Pfizer vaccine: 'మూడో​ డోస్​తో కొవిడ్​ నుంచి మరింత రక్షణ'

ABOUT THE AUTHOR

...view details