తెలంగాణ

telangana

ETV Bharat / international

'కరోనా కథ ముగియలేదు.. టీకా ఒక్కటే మార్గం కాదు' - ప్రపంచ ఆరోగ్య సంస్థ

ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల టీకాలు అందించినా.. కరోనా అంతరించడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. వైరస్​ను అరికట్టడానికి టీకా ఒక్కటే మార్గం కాదని, ఇంకా చాలా సాధనాలు ఉన్నాయని చెప్పారు.

Covid-19 pandemic long way from over, warns WHO chief
డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్

By

Published : Apr 13, 2021, 5:36 PM IST

ప్రపంచవాప్తంగా 78 కోట్ల కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినప్పటికీ, మహమ్మారి అంతరించడానికి ఇంకా చాలా సమయం ఉందని హెచ్చరించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్. వైరస్​ను ఎదుర్కోవడానికి టీకాలు శక్తిమంతమైనవే అయినా అదొక్కటే సాధనం కాదని చెప్పారు.

"వైరస్​ను జయించడానికి భౌతిక దూరం, మాస్కులు, వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత పనిచేస్తాయి. నిఘా, టెస్టింగ్, ట్రేసింగ్, ఐసొలేషన్, క్వారంటైన్​ లాంటివాటితోనూ వ్యాధిని అరికట్టవచ్చు. ఈ ఏడాది తొలి రెండు నెలల్లో కేసులు తగ్గాయంటే.. వైరస్​ను మనం కచ్చితంగా అదుపు చేయగలమని అర్థం. అయితే, నిబంధనల అమలులో లోపం, పాటించడంలో నిర్లక్ష్యం వల్ల తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది."

-టెడ్రోస్, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్

కరోనాను జయించినవారిలో దీర్ఘకాలిక సమస్యల గురించి మనకు ఇంకా పూర్తిగా తెలియదని టెడ్రోస్ అన్నారు. ఇది ఫ్లూ కాదని హెచ్చరించారు. యువత, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా దీనికి బలయ్యారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా టీకాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:విదేశీ టీకాలకు సత్వర అనుమతులు: కేంద్రం

ABOUT THE AUTHOR

...view details