ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా దేశాల్లో కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 3.35 కోట్ల మందికి వైరస్ సోకగా.. 10.06 లక్షల మంది మృత్యువాత పడ్డారు. రోజుకు సగటున 5 వేల మంది మరణిస్తున్నట్లు అంచనా.
- అమెరికాలో కొత్తగా 37వేల కేసులు రాగా మొత్తం బాధితుల సంఖ్య 73.61 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య 2.09 లక్షలకు పెరిగింది.
అమెరికాలో కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 నిమిషాల్లో ఫలితాన్నిచ్చే 15 కోట్ల ర్యాపిడ్ టెస్టు కిట్లను పంపిణీ చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గతవారంలో అమెరికాలో రికార్డు స్థాయిలో 10 కోట్ల పరీక్షలు నిర్వహించారు.
- బ్రెజిల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సోమవారం 16 వేల కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 47.48 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 1.42 లక్షల మంది మరణించారు.
- రష్యాలో వైరస్ వ్యాప్తి స్వల్పంగా పెరుగుతోంది. కొత్తగా 8 వేల మందికి వైరస్ సోకగా మొత్తం సంఖ్య 11.59 లక్షలకు పెరిగింది. మరణాల సంఖ్య అదుపులో ఉంది.
- స్పెయిన్, ఫ్రాన్స్, ఇరాన్, బ్రిటన్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోంది.