తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనా నుంచి కంపెనీల తరలింపుపై అమెరికాలో బిల్లు

చైనా నుంచి తమ కంపెనీలను వెనక్కి రప్పించుకునేందుకు వీలుగా అమెరికా కాంగ్రెస్​లో ఓ బిల్లును ప్రవేశపెట్టారు చట్టసభ్యుడు గ్రీన్​. కరోనా వైరస్​ సంక్షోభం నేపథ్యంలో కంపెనీలను తరలించడానికి ప్రోత్సహాకాలు అందివ్వాలని గ్రీన్​ ప్రతిపాదించారు.

COVID-19: Legislation introduced in Congress to bring back US companies from China
చైనా నుంచి కంపెనీల తరలింపుకు అమెరికాలో బిల్లు

By

Published : May 19, 2020, 10:48 AM IST

అమెరికా- చైనా మధ్య 'కరోనా' అగ్గి రాజుకుంది. వైరస్​కు సంబంధించిన వివరాలను చైనా దాచిపెడుతోందంటూ అమెరికా చేసిన ఆరోపణలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజాగా అమెరికా మరో అడుగు ముందుకేసింది. చైనా నుంచి తమ కంపెనీలు వెనక్కి వచ్చే విధంగా ప్రోత్సాహకాలు అందివ్వాలని ఓ ప్రముఖ చట్టసభ్యుడు కాంగ్రెస్​లో బిల్లు ప్రవేశపెట్టారు.

"ది బ్రింగ్​ అమెరికన్​ కంపెనీస్​ హోం యాక్ట్​"ను చట్టసభ్యుడు మార్క్​ గ్రీన్​ ప్రవేశపెట్టారు. కంపెనీలు తిరిగి వచ్చేందుకు అయ్యే 100 శాతం ఖర్చును ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించారు.

"మన ఆర్థిక వ్యవస్థకు ఊతమందివ్వడం కోసం పెట్టుబడులను ఆకర్షించడం ఎంతో అవసరం. అమెరికాకు తిరిగి రావాలనుకునే కంపెనీలకు ఉన్న ప్రధాన అడ్డంకి.. 'వ్యయం'. కరోనా వైరస్​ నేపథ్యంలో అనిశ్చితి నెలకొంది. ఈ సమయంలో వెనక్కి రావాలనుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, ప్రమాదం అని కంపెనీలు భావిస్తున్నాయి. చైనా నమ్మకమైన భాగస్వామి కాదని రుజువైంది. ఈ సమయంలో అమెరికాను అభివృద్ధి చేయడానికి, చైనాపై ఆధారపడటం తగ్గించడానికి.. అవకాశాలు, పెట్టుబడుల కోసం మన దేశ తలుపులు తెరవాలి. ఇదే నేను ప్రతిపాదించిన బిల్లు."

--- మార్క్​ గ్రీన్​, అమెరికా చట్టసభ్యుడు.

కరోనా సంక్షోభంలో చైనా ఎత్తుగడల నుంచి అమెరికా వ్యవస్థలను కాపాడుకోవాలంటూ మరో బిల్లును ప్రవేశపెట్టారు గ్రీన్​. అమెరికా జాతీయ భద్రతకు కీలకమైన కంపెనీలను ఆదుకోవడానికి పెట్టుబడిదారులకు తగిన ప్రోత్సాహకాలు అందివ్వాలని బిల్లులో ప్రతిపాదించారు.

ఇదీ చూడండి-చైనా చేతిలో డబ్ల్యూహెచ్​ఓ ఓ కీలుబొమ్మ: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details