ఓ భారతీయ అమెరికన్ దంపతులు తక్కువ ధరకు లభించే 'పోర్టబుల్ ఎమర్జెన్సీ వెంటిలేటర్'ను అభివృద్ధి చేశారు. త్వరలోనే ఈ వెంటిలేటర్ ఉత్పత్తి దశకు చేరుకుంటుంది. కరోనా రోగులతో చికిత్స అందించేందుకు భారత్‌తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చౌక ధరలకే లభించనుంది.
ప్రఖ్యాత జార్జి డబ్ల్యూ వుడ్రఫ్ స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్‌లోని ప్రొఫెసర్ దేవేశ్ రంజన్, ఫ్యామిలీ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ఆయన భార్య కుముదా రంజన్ ఈ వెంటిలేటర్ నమూనాను రూపొందించారు. కరోనా కారణంగా వెంటిలేటర్ల కొరత తీవ్రమైన నేపథ్యంలో 3 వారాల్లోనే ఈ నమూనాను తయారు చేశారు.
"పెద్ద ఎత్తున తయారు చేస్తే ఒక్కో వెంటిలేటర్‌కు వంద డాలర్లకన్నా తక్కువ ఖర్చవుతుంది. ఒకవేళ గరిష్ఠంగా 500 డాలర్లకు విక్రయించినా చాలినంత లాభాలు ఆర్జించవచ్చు. ప్రస్తుతం అమెరికాలో ఇలాంటి వెంటిలేటర్లు సగటున 10 వేల డాలర్లకు విక్రయిస్తున్నారు."
- దేవేశ్ రంజన్