తెలంగాణ

telangana

ట్రంప్ చెప్పిన మందు వాడితే ఇబ్బందే: ఎఫ్​డీఏ

By

Published : Apr 25, 2020, 11:15 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విస్తృతంగా ప్రచారం చేస్తున్న మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్​ దుష్ప్రభావం చూపుతుందని ఆ దేశ ఆహార, ఔషధ పరిపాలన(ఎఫ్​డీఏ) విభాగం తెలిపింది. హృద్రోగ సమస్యలు వస్తాయని హెచ్చరించింది. వైరస్ ప్రభావం​ తీవ్రంగా ఉన్న రోగులకు మాత్రమే ఇవ్వాలని సూచించింది ఎఫ్​డీఏ.

COVID-19: FDA warns against side effects of hydroxychloroquine
'హైడ్రాక్సీక్లోరోక్విన్​ ఔషధంతో హృద్రోగ సమస్యలు'

కరోనా చికిత్సకు సంజీవనిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రచారం చేస్తున్న మలేరియా ఔషధం హైడ్రాక్సీక్లోరోక్విన్​ దుష్ప్రభావం చూపుతుందని ఆ దేశ ఆహార, ఔషధ పరిపాలన(ఎఫ్​డీఏ)​ విభాగం తెలిపింది. ఈ మందు వల్ల తీవ్రమైన హృద్రోగ సమస్యలు వస్తాయని హెచ్చరించింది. తీవ్ర వైరస్​ ప్రభావంతో బాధపడుతూ.. అత్యవసర విభాగంలో ఉన్న రోగలకు మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్​ ఇవ్వాలని సూచించింది ఎఫ్​డీఏ.

అప్పుడే చెప్పింది..

మలేరియా ఔషధం ఉపయోగించడానికి ఆమోదం తెలిపినప్పుడే ఈ నష్టాలు గురించి ఎఫ్​డీఏ వెల్లడించింది. వైరస్​ బాధితులు ఆసుపత్రి లేదా క్లినికల్ ట్రయల్స్​లో వైద్య నిపుణులు పర్యవేక్షణలో ఉన్నప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్​ను ఇవ్వవచ్చని సూచించింది.

"రోగులకు నాణ్యమైన చికిత్స అందించడానికి వైద్యులు తమకు ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటారు. వైద్యులు ఉత్తమమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని వారికి అందిస్తున్నాం. కొవిడ్​-19 చికిత్సలో వినియోగిస్తున్న ఔషధాల భద్రత, ప్రభావంపై పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు సరైన నిర్ణయాలు తీసుకోవాలి."

- స్టీఫెన్​ ఎం హాన్​, ఎఫ్​డీఏ కమిషనర్​

మరింత సమాచారం..

కరోనా చికిత్సలో వినియోగిస్తున్న ఔషధాలపై పరిశోధన జరిపి, వాటివల్ల వచ్చే ప్రమాదాల గురించి మరింత సమాచారం అందుబాటులో ఉంచుతామని స్టీఫెన్ తెలిపారు.

ఇదీ చూడండి:కరోనా తర్వాతి టార్గెట్ ఆసియానేనా!

ABOUT THE AUTHOR

...view details