చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి అమెరికాతోపాటు ఐరోపాలో విధ్వంసం సృష్టిస్తోంది. చైనాను మించి అక్కడ రోజురోజుకు మరణాలు పెరుగుతున్నాయి. కరోనా మరణాలు రేటులో కూడా చైనాను ఈ దేశాలు దాటాయి.
చైనాలో కేసులను బట్టి వేసిన అంచనాల ప్రకారం.. కరోనా సోకిన వారిలో 80 శాతం మందికి తేలికపాటి లక్షణాలు ఉన్నట్లు తెలిపింది. వారికి ఆసుపత్రుల్లో చికిత్స చేయాల్సిన అవసరం లేదని చెప్పింది.
పరికరాల కొరతతో..
అయితే ప్రపంచవ్యాప్తంగా వ్యక్తిగత సంరక్షణ పరికరాలు, పరీక్ష కిట్లు కొరత ఉంది. ఈ పరిస్థితుల్లో వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల్లో చేర్పించాలని సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వారితో పోలిస్తే వీరి ప్రాణాలకు ముప్పు ఎక్కువ.
ఆసుపత్రుల్లో చేరిన కరోనా బాధితుల కన్నా వాస్తవానికి ప్రభావితమైనవారి సంఖ్య చాలా ఎక్కువ. కానీ వైద్య సహాయం పొందే వారినే సాధారణంగా కరోనా కేసులుగా లెక్కిస్తున్నారు. ఫలితంగా అనుకున్న దానికన్నా కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.
మరో కారణం..